సొంత ఇంటికి వచ్చిన భావన కలుగుతుంది : కత్రినా | Katrina Kaif Shares Dance Rehearsal Video Goes Viral | Sakshi
Sakshi News home page

వైరల్‌ : డ్యాన్స్‌తో అదరగొట్టిన కత్రినా!

Published Tue, Dec 18 2018 7:42 PM | Last Updated on Tue, Dec 18 2018 7:44 PM

Katrina Kaif Shares Dance Rehearsal Video Goes Viral - Sakshi

‘తనతో పనిచేయడం ఎప్పుడూ సౌకర్యంగానే ఉంటుంది. తన టీమ్‌తో కలిసినపుడు సొంత ఇంటికి వచ్చిన భావన కలుగుతుంది. రేస్‌ సినిమాలో జర జర సాంగ్‌ బాగా రావడం కోసం తను నన్ను ప్రోత్సహించిన విధానాన్ని మర్చిపోలేను. ఇప్పుడేమో ఆనంద్‌ రాయ్‌, బోస్కీ డాన్స్‌ను ఎలా ఎంజాయ్‌ చేయాలో.. మనకోసం మనం డాన్స్‌ చేస్తే అందులో ఉండే ఆనందం ఏమిటో ఈ పాట ద్వారా తెలియచేశారు’ అంటూ బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన వీడియో తెగ వైరల్‌ అవుతోంది.


బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌, అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌ ప్రధాన పాత్రల్లో.. ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ జీరో మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కింగ్‌ ఖాన్‌ మరుగుజ్జు పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో... క్యాట్స్‌ మూవీ స్టార్‌గానే అలరించనున్నారు. ఈ నేపథ్యంలో ‘హసన్‌ పర్‌చామ్‌’ అనే సాంగ్‌ కోసం చేసిన డ్యాన్స్‌ రిహార్సల్‌ తాలూకు వీడియోను కత్రినా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఇంత మంచి స్టెప్స్‌ను నేర్పించినందుకు థాంక్స్‌ అంటూ కొరియోగ్రాఫర్‌ బోస్కోమార్టిస్‌ను ప్రశంసిస్తూ షేర్‌ చేసిన ఈ వీడియోను ఇప్పటికే ఐదు లక్షల మందికి పైగా నెటిజన్లు వీక్షించారు. అంతటితో ఆగకుండా కత్రినా డ్యాన్సింగ్‌ క్వీన్‌.. తెరవెనుక ఇంత కష్టపడాల్సి ఉంటుందా.. నిజంగా చాలా గ్రేట్‌ అంటూ ఆమెను కొనియాడుతున్నారు కూడా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement