
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపించాడు. ఈ శుక్రవారం జీరోతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న షారుఖ్ ప్రమోషన్‌లో భాగంగా టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ‘బన్నీ చాలా టాలెంటెడ్ త్వరలోనే తనని కలిసి టైం స్పెండ్ చేస్తా’నన్నాడు షారుఖ్.
ఆనంద్ ఎల్‌రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జీరో సినిమాలో షారుఖ్ మరుగుజ్జు పాత్రలో నటిస్తున్నాడు. కొంత కాలంగా వరుసఫెయిల్యూర్స్ తో ఇబ్బందుల్లో ఉన్న బాద్ షా ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. తెలుగు హీరోల్లో ఇతర భాషల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరో అల్లు అర్జున్. బన్నీ సినిమాలు మాలీవుడ్ లో రికార్డ్‌లు తిరగరాస్తుంటే.. హిందీలో డబ్ అయిన సినిమాలు యూట్యూబ్‌లో సంచలనాలు నమోదు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment