
ఇప్పటికే చాలా సార్లు వెండితెరకెక్కిన మహాభారత గాథ ఇప్పుడు మరింత భారీగా రూపొందనుంది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఈ భారీ ప్రాజెక్ట్‌కు పూనుకున్నాడు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా సిరీస్‌గా మహాభారతాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో ఆమిర్.. శ్రీ కృష్ణుడిగా నటించే అవకాశం ఉందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.
ఈ వార్తలపై బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ స్పందించాడు. జీరో సినిమా ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన షారూఖ్ తనకు శ్రీ కృష్ణుడి పాత్రలో నటించాలని ఉందని.. అయితే ఆ పాత్రను త్వరలో ఆమిర్ పోషించబోతున్నాడని వెల్లడించారు. దీంతో మహాభారతంలో ఆమిర్ చేయబోయేది శ్రీకృష్ణుడి పాత్రే అని కన్ఫామ్ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment