సూపర్‌స్టార్‌ను తీసేసి యంగ్‌ హీరోతో..! | Vicky Kaushal to Replace Shah Rukh Khan in the Rakesh Sharma Biopic | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 27 2019 11:43 AM | Last Updated on Sun, Jan 27 2019 11:43 AM

Vicky Kaushal to Replace Shah Rukh Khan in the Rakesh Sharma Biopic - Sakshi

బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్‌ తరువాత అదే స్థాయిలో స్టార్‌ ఇమేజ్‌, ఫ్యాన్‌ ఫాలోయింగ్ సాధించుకున్న నటుడు షారూఖ్‌ ఖాన్‌. ఒకప్పుడు వరుస విజయాలతో బాద్‌షాగా వెలుగొందిన కింగ్‌ ఖాన్‌ ఇటీవల వరుస పరాజయాలతో డీలా పడిపోయాడు. తాజాగా జీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన షారూఖ్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన జీరో భారత్‌లో వందకోట్ల వసూళ్ల మార్క్‌ను కూడా అందుకోలేకపోయింది.

దీంతో షారూఖ్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్‌ విషయంలో కూడా మార్పలు మొదలయ్యాయి. ముఖ్యంగా రాకేష్ శర్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌ మూవీ నుంచి షారూఖ్‌ను తొలగించటం ఫ్యాన్స్‌ అవమానంగా భావిస్తున్నారు. వయసు కారణంగానే షారూఖ్‌ను కాదని యంగ్ హీరోల వైపు చూస్తున్నట్టుగా నిర్మాతలు చెపుతున్నా మార్కెట్ లేని కారణంగానే బాద్‌షాను పక్కకు పెట్టారన్న వాదన వినిపిస్తోంది. షారూఖ్‌ స్థానంలో యంగ్ హీరో విక్కీ కౌషల్‌ పేరును పరిశీలిస్తున్నారు. మరి ఈ పరిస్థితులనుంచి కింగ్ ఖాన్ ఎలా బయటపడతాడో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement