
షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్
షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్.. ఒకప్పుడు ఇద్దరి మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉండేది కాదు. కానీ ఈ మధ్య ఆ ఈక్వేషన్స్ అన్నీ మార్చేశారు. ఒకరి సినిమాలను మరొకరు పొగుడుతూ, సినిమాల రిలీజ్‌ల ముందు అభినందించుకుంటూ ఆహ్లాదకర వాతావరణం తీసుకొచ్చారు. తాజాగా షారుక్ ‘జీరో’ ట్రైలర్‌ను చూసిన ఆమిర్‌ఖాన్ ‘‘ట్రైలర్ అద్భుతంగా ఉంది. టీమ్ అందరికీ కంగ్రాట్స్. షారుక్ నిన్ను నువ్వు బీట్ చేసేశావ్. సినిమా చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు. దానికి సమాధానంగా షారుక్ ‘థగ్‌తో హగ్’ అంటూ ఆమిర్‌తో దిగిన ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఇవాళ (నవంబర్ 2) షారుక్ బర్త్‌డే. ఈ సందర్భంగా ‘జీరో’ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment