‘జీరో’ వివాదం ముగిసినట్టేనా..! | Shahrukh Khan Zero Dispute Ended | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 19 2018 12:24 PM | Last Updated on Wed, Dec 19 2018 1:50 PM

Shahrukh Khan Zero Dispute Ended - Sakshi

కొంత కాలంగా వరుసఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న బాలీవుడ్ అగ్ర హీరో షారూఖ్‌ ఖాన్‌ ఈ శుక్రవారం జీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో షారూఖ్‌ మరుగుజ్జు పాత్రలో నటిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమా ట్రైలర్‌ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ట్రైలర్‌లో షారూఖ్‌.. సిక్కులు కిర్పన్‌ ను ధరించి ఉండటం వివాదాస్పదమైంది. అమృతాపాల్ సింగ్‌ అనే న్యాయవాధి కోర్టును ఆశ్రయించటంతో చిత్రయూనిట్ స్పందించింది.

అది కిర్పన్‌ కాదని కేవలం ఆ పాత్ర తన పెళ్లి సమయంలో వేసుకున్న ఓ అలంకారం మాత్రమే అని కోర్టుకు తెలిపారు. ఈ సన్నివేశాల వల్ల ఎవరి మనోభావాలైన దెబ్బతింటే సదరు సన్నివేశాల్లో కనిపించిన బాకును గ్రాఫిక్స్‌లో ఓ షో పీస్‌లా మారుస్తామని కోర్టుకు తెలిపారు. దీంతో జీరో వివాదం ముగినట్టే అని భావిస్తున్నారు. ఆనంద్‌ ఎల్‌రాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జీరో సినిమాను షారూఖ్‌ స్వయంగా నిర్మిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement