‘తమ్ముడు నువ్వు ఎంతో ఎదిగిపోయావ్‌’ | Shah Rukh Khan Thanks To Riteish Deshmukh For Postpone His Film Mouli | Sakshi
Sakshi News home page

‘నీ అవసరం కన్నా నా ఆత్మాభిమానానికే ప్రాధాన్యత ఇచ్చావ్‌’

Published Tue, Nov 6 2018 7:54 PM | Last Updated on Tue, Nov 6 2018 8:21 PM

Shah Rukh Khan Thanks To Riteish Deshmukh For Postpone His Film Mouli - Sakshi

బడా హీరోల సినిమాలు.. చిన్న హీరోల సినిమాలు ఒకేసారి రావు. ఒకవేళ అలాంటి పరిస్థితే ఎదురయితే చిన్న హీరోలు రేస్‌ నుంచి తప్పుకుంటారు. ఎప్పుడో.. ఎక్కడో కథ మీద బాగా నమ్మకం ఉంటే తప్ప చిన్న హీరోలు, బడా హీరోలతో పోటికి దిగరు. ప్రస్తుతం బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుక్‌ ఖాన్‌ ఇదే పరిస్థితి ఎదురయ్యింది. షారుక్‌ ఖాన్‌ హీరోగా నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘జీరో’.. రితేష్‌ దేశ్‌ముఖ హీరోగా వస్తోన్న మరాఠీ చిత్రం మౌలీ చిత్రం రెండు ఒకేరోజు బాక్సాఫీస్‌ వద్ద బరిలో దిగునున్నాయి. ఈ క్రమంలో షారుక్‌ కోసం తన సినిమా విడుదలను వాయిదా వేసుకున్నారు రితేష్‌ దేశ్‌ముఖ్‌.

ఎందుకంటే షారుక్‌ ఖాన్‌ ‘జీరో’ చిత్రం ఇండియావైడ్‌గా విడుదలవుతోంది. ఈ క్రమంలో అదే రోజు ‘మౌలీ’ సినిమా కూడా వస్తే మరాఠీ ప్రజలు వారి మాతృభాష చిత్రానికే తొలి ప్రాధాన్యత ఇస్తారు. దాంతో ఆ ప్రభావం షారుక్‌ ‘జీరో’ చిత్రం మీద పడుతోంది. ఇవన్ని ఆలోచించిన రితేష్‌, షారుక్‌ కోసం తన సినిమా విడుదలను వాయిదా వేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన షారుక్‌, రితేష్‌ మంచి మనసుకు మురిపిపోయి ట్విట్టర్‌ వేదికగా తన కృతజ్ఞతలు తెలియజేశారు.

‘నా చిన్న తమ్ముడు చాలా పెద్దవాడు అయ్యాడు. నీ విశాల హృదయానికి.. ప్రేమకు, గౌరవానికి నా ధన్యవాదాలు. నీ అవసరం కన్నా నా ఆత్మాభిమానానికే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చావ్‌. ఈ విషయం నిజంగా నా హృదయాన్ని కదిలించింది. చాలా సంతోషంగా ఉంది’ అంటూ షారుక్‌ ట్వీట్‌ చేశారు.

‘మౌలీ’ రితేష్‌ దేశ్‌ముఖ్‌ నటిస్తోన్న రెండో మరాఠీ చిత్రం. రితేష్‌ ‘లయి భారి’ అనే మరాఠి చిత్రంతో 2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ప్రస్తుతం రితేష్‌ హిందీలో ‘హౌస్‌ఫుల్‌ 4’లో అక్షయ్‌ కుమార్‌, రానా దగ్గుబాటి, బాబి డియోల్‌తో కలిసి నటిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement