జీరో మూవీలో షారుక్ ఖాన్
ముంబై : బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో ప్రేక్షకుల మందుకు రాబోతున్న ‘జీరో’ చిత్రం వివాదంలో చిక్కుకుంది. తమ మనోభావాలు కించపరిచే సన్నివేశాలు ఈ మూవీలో ఉన్నాయని సిక్కులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఢిల్లీ సిక్కు గురుద్వార్ కమిటీ జనరల్ సెక్రటరీ మజిందర్ సింగ్ సిర్సా ఢిల్లీ పోలీస్ స్టేషన్‌లో షారుఖ్‌తో పాటు చిత్ర దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మూవీ ట్రైలర్‌లో షారుక్ ఖాన్.. సిక్కులు పవిత్రంగా భావించే గట్రాకిర్పాన్ ధరించాడని, అది సిక్కుల మనోభావాలు కించపరిచడమేన్నారు.
‘జీరో మూవీ ట్రైలర్‌లో సిక్కుల మనోభావాలు కించపరిచే సన్నివేశాలున్నాయని చాలా మంది నా దృష్టికి తీసుకువచ్చారు. సిక్కులు పవిత్రంగా భావించే గట్రాకిర్పాన్‌ను షారుక్ ధరించినట్లు మూవీ టీజర్‌లో కనిపించింది. సిక్కుల సంప్రదాయం ప్రకారం అమ్రిత్‌ధరి సిక్కులు మాత్రమే అది ధరిస్తారు. కానీ ఈ మూవీలో ధరించి మా సెంటిమెంట్స్‌ను కించపరిచారు. వెంటనే ఈ సన్నివేశాలను తొలగించి, చిత్ర దర్శకుడు, హీరోపై చర్యలు తీసుకోవాలి’ అని మజిందర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరగుజ్జు పాత్రలో షారుఖ్ నటిస్తుండగా, కుర్చీకే పరిమితమైన దివ్యాంగురాలిగా అనుష్క శర్మ.. అతిధి పాత్రలో కత్రినా నటిస్తుండటంతో ఈమూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment