మల్టిస్టారర్ సినిమాలు టాలీవుడ్‌లో మళ్లీ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. వరుస బెట్టి మల్టిస్టారర్‌లు తెరకెక్కుతున్నాయి. వీటన్నంటిలో రాజమౌళి తెరకెక్కించనున్న చిత్రానికి ఇండియావైడ్ క్రేజ్ నెలకొంది. ఇక బాలీవుడ్‌లో ఇలాంటి భారీ మల్టిస్టారర్‌లకు కొదవే ఉండదు. అక్కడి స్టార్ హీరోలు తెరను పంచుకోవడానికి ఆసక్తి చూపడమే అందుకు కారణం.
అయితే ప్రస్తుతం బాలీవుడ్‌లో అలాంటి ఓ మల్టిస్టారర్ చిత్రానికి క్రేజ్ మామూలుగా లేదు. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’ కోసం బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో పాత్రలను పరిచయం చేస్తూ రిలీజ్ చేస్తున్న మోషన్ పోస్టర్స్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా తన పాత్రకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేసిన ఆమీర్.. ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. ‘నా పేరు ఫిరంగి మల్లాహ్. ఈ భూమిపై నాకంటే మంచి మనిషి మీకు ఎక్కడా కనిపించడు. నిజం నా మారు పేరు. నమ్మకం నా వృత్తి. దీదీ మీద ఒట్టు’ అని ట్వీట్ చేస్తూ ప్రోమో రిలీజ్ చేశాడు. అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, ఫాతిమా సనా షేక్, కత్రినా కైఫ్ ముఖ్య తారలుగా.. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ మూవీ దీపావళి కానుకగా నవంబర్ 8న రిలీజ్ కానుంది.
और इ हैँ हम, फिरंगी मल्लाह.
— Aamir Khan (@aamir_khan) September 24, 2018
हम से ज्यादा नेक इन्सान इस धरती पे कहीं नहीं मिलेगा आपको.
सच्चाई तो हमरा दूसरा नाम है, और भरोसा हमरा काम.
दादी कसम !!!https://t.co/GyIsrM2rNp#ThugsOfHindostan | @yrf | @TOHtheFilm | @SrBachchan | @fattysanashaikh | #KatrinaKaif
Comments
Please login to add a commentAdd a comment