
ఆ హీరో గొప్పదనం ఇదే.. షాకింగ్ ఫొటోలు!
సాక్షి, ముంబై: పరిపూర్ణత కోసం పరితపించే హీరో ఆమిర్ ఖాన్. తాను పోషించే పాత్ర కోసం ఆయన ప్రాణం పెడతారు. పాత్రలోకి పూర్తిగా పరకాయ ప్రవేశం చేసేందుకు ఎంతకష్టమైనా భరిస్తారు. అందుకే ఈ 'మిస్టర్ ఫర్ఫెక్ట్' రెండేళ్లకో సినిమా తీసినా.. ఆ సినిమాను చూసేందుకు వేలమంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తారు.
రెజ్లింగ్ నేపథ్యంగా వచ్చిన 'దంగల్' సినిమా కోసం బరువు పెరిగి.. బొద్దుగా కనిపించిన ఆమిర్.. ఇప్పుడు 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' సినిమా కోసం సన్నబడి కండలుపెంచాడు. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమిర్ 'బందిపోటు'గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ మొరాకోలో పూర్తయింది. కత్రినా కైఫ్, సనా ఫాతిమా షైక్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌కు ఎంతలేదన్న మూడు-నాలుగు నెలల సమయం పడుతుందని అంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' షూటింగ్‌కు సంబంధించిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఇందులో సన్నగా పూర్తిగా పాత్రలో ఇమిడిపోయి గుర్తుపట్టనివిధంగా ఆమిర్ ఖాన్ కనిపించడం అభిమానులను థ్రిల్‌కు గురిచేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్‌గా మారిపోయాయి.