లీకైన మెగాస్టార్‌ లుక్‌ | Amitabh Bachchan Poster Leaked From Thugs Of Hindostan Movie | Sakshi
Sakshi News home page

లీకైన మెగాస్టార్‌ లుక్‌

Published Wed, Mar 14 2018 9:41 AM | Last Updated on Mon, May 28 2018 3:53 PM

Amitabh Bachchan Poster Leaked From Thugs Of Hindostan Movie - Sakshi

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, బాలీవుడ్‌ మిష్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ఖాన్‌ కలిసి నటిస్తున్న ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’  సినిమా లుక్‌ లీకైంది. ఈ సినిమాలో అమితాబ్‌ పాత్రకు సంబంధించిన లుక్‌ అంటూ ఓ ఫోటో  సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ పోస్టర్‌కు ఫిదా అయిన ఫ్యాన్స్‌ తెగ షేర్‌  చేసుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రాంలో ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది. కానీ, దీనిపై చిత్రబృందం అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పటికే ఆమిర్‌ఖాన్‌కు సంబంధించిన లుక్స్‌ బయటకు వచ్చి, ఫ్యాన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాను యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ నిర్మాణంలో ఫిలిఫ్‌ మెడోస్‌ టేలర్‌ రాసిన నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు. అసలే బిగ్‌ బీ, సీనియర్‌ నటుడు అయిన అమితాబ్‌, ఆమిర్‌ఖాన్‌ కలిసి నటిస్తుండటంతో బాలీవుడ్‌ దృష్టి మొత్తం ఈ సినిమాపైనే ఉంది. ఈ సినిమా గురించి ఏ చిన్న విషయం తెలిసినా బీటౌన్‌ మొత్తం చర్చించుకుంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement