
ఆమిర్‌ఖాన్
మార్కెటింగ్ మెళకువలు బాగా తెలిసిన నటుడు ఆమిర్ ఖాన్. కేవలం మంచి స్క్రిప్ట్ ఎంచుకోవడంలోనే కాదు దాన్ని ఆడియన్స్ వరకూ తీసుకెళ్లడంలోనూ మాస్టర్ ఆయన. అందుకే కలెక్షన్స్ రాబట్టడంలో టాప్‌లో ఉంటారు. లేటెస్ట్‌గా విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ఆమిర్‌ఖాన్, అమితాబ్ బచ్చన్ యాక్ట్ చేస్తోన్న భారీ బడ్జెట్ పీరియాడికల్ మూవీ ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’.
కత్రినా కైఫ్, ఫాతిమా సనాషేక్ హీరోయిన్లు. ఈ సినిమాను 3డి, ఐమాక్స్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసింది చిత్రబృందం. అలాగే తెలుగు, తమిళ భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేయనుంది. ఈ రెండు భాషల్లో మాత్రమే కాదు.. వీలైనన్ని ఎక్కువ భాషల్లో రిలీజ్ చేసి అన్ని మార్కెట్స్‌లో కలెక్షన్స్ కొల్లగొట్టాలనుకుంటోంది. నవంబర్ 7న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని యశ్‌రాజ్ సంస్థ నిర్మిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment