సాధారణంగా పండుగ సెలవులను టాలీవుడ్ ఇండస్ట్రీ మిస్ చేసుకోదు. అందుకే ఏ పండుగ వచ్చినా సినిమాల సందడి గట్టిగానే కనిపిస్తుంది. కానీ ఒక్క దీపావళికి మాత్రం టాలీవుడ్‌లో పెద్దగా సందడి కనిపించదు. స్టార్ హీరోలెవరు ఈ సీజన్‌కు తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపించరు.
ఈ ఏడాది కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. ఒక్క స్ట్రయిట్ తెలుగు సినిమా కూడా దీపావళి బరిలో కనిపించటం లేదు. విజయ్ హీరోగా తెరకెక్కిన తమిళ సినిమా సర్కార్, బాలీవుడ్ ప్రస్టీజియస్ సినిమా థగ్స్ ఆఫ్ హిందుస్థాన్‌లు తెలుగు లో రిలీజ్ అవుతున్న మన సినిమాలు లేకపోవటం వెలితే. నవంబర్ 2న రిలీజ్ అవుతున్న సవ్యసాచి ఒక్కటే ఈ ఏడాది దీపావళి సినిమా అనిపించుకోనుంది.
గత ఏడాది కూడా ఇదే పరిస్థితి కనిపించింది. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ రాజా ది గ్రేట్ ఒక్కటే దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకోవటంతో పెద్దగా పోటి లేకపోవటంతో ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. దీంతో రాజా దిగ్రేట్ బాక్ల్ బస్టర్ సక్సెస్ సాదించింది.
2016లో దీపావళికి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. అంతకు ముందు ఏడాది అక్కినేని యువ కథానాయుడు హీరోగా పరిచయం అయిన అఖిల్ ప్రేక్షకుల ముందుకు వచ్చినా డిజాస్టర్ టాక్‌తో నిరాశపరిచింది. అప్పుడే దసరా సెలవులు ముగించుకోని అందురూ బిజీ అవుతారన్న ఉద్దేశంతో ఇండస్ట్రీ ఈ సీజన్ మీద పెద్దగా దృష్టి పెట్టడం లేదు. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం దీపావళి సందడి గట్టిగానే కనిపిస్తుంది. టాప్ స్టార్స్, భారీ చిత్రాలు ఈ సీజన్‌లో పోటి పడుతుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment