దంగల్‌ నటికి బెదిరింపులు | Shameless selfie | Sakshi
Sakshi News home page

దంగల్‌ నటికి బెదిరింపులు

Published Sat, Oct 14 2017 7:20 PM | Last Updated on Sat, Oct 14 2017 7:20 PM

Shameless selfie

న్యూఢిల్లీ : దంగల్‌ మేవీ ఫేమ్‌ ఫాతిమా సనా షేక్‌కు కొద్దికాలంగా బెదిరింపులు వస్తున్నాయి. కొందరు పోకిరి వెధవలు.. ఏకంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో అసభ్యకరంగా మెసేజ్‌లో పోస్ట్‌ చేస్తున్నారు. ఇటువంటి పోస్ట్‌లకు ఫాతిమా కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. ఇదంతా ఎందుకు వచ్చిందంటే.. నాలుగైదు రోజులు కిందట సనా.. ఒక సెల్ఫీ తీసుకుని.. దానికి షేమ్‌లెస్‌ సెల్ఫీ అనే టైటిల్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. అప్పటి నుంచి ఈ ఫొటోపై విపరీతమైన, అభ్యంతరకర రీతిలో కామెంట్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి.

కొందరైతే.. నీవు ధరించి దుస్తులు.. నీమీద గౌరవాన్ని తగ్గిస్తున్నాయని అంటే.. మరొకరు.. నువ్వు నిజంగా షేమ్‌లెస్‌ కాబట్టే ఇటువంటి ఫొటో పెట్టావు అని మరొకరు కామెంట్లు పెట్టారు. కాగా ఈ ఫొటోను ఇప్పటివరకూ 80 వేల మంది లైక్‌ కొట్టగా.. 1300 కామెంట్లు వచ్చాయి. గతంలో కూడా సనా ఇటువంటి ఫొటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి.. పలు విమర్శలు పాలైంది.

Shameless selfie😬📸 credit for Saree @swatimukund 😘😘

A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement