
సన్యా మల్హోత్రా
‘దంగల్’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమయ్యారు సన్యా మల్హోత్రా. ఆ తర్వాత విశాల్ భరద్వాజ్ ‘పటాకా’ సినిమాతో హిట్ సాధించారు. కెరీర్‌లో ఎప్పుడూ ప్రయోగాలకు వెనుకాడను అంటున్నారు సన్యా. ‘‘నేను శిక్షణ తీసుకున్న ఆర్టిస్ట్‌ని కాదు. అందుకే చేసే ప్రతి పాత్ర కొత్తగా ఉండాలనుకుంటాను. అప్పుడే చాలెంజ్‌లు ఎదురవుతాయి, కొత్తగా ఏదైనా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ప్రతి సినిమాకు ఇదే పద్ధతిని పాటిస్తున్నాను. ప్రయోగాలకు అస్సలు వెనుకాడను. ఒకే జానర్‌కి అంటూ ఆంక్షలు విధించుకోను’’ అన్నారు. సన్యా నటించిన ‘బదాయి హో’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment