Sanya Malhotra: Gifts Herself New House In Juhu, Mumbai - Sakshi
Sakshi News home page

Sanya Malhotra: దంగ‌ల్ బ్యూటీ కొత్తిల్లు, క్రిష్ పొరుగింట్లోనే!

Published Fri, Nov 5 2021 2:36 PM | Last Updated on Fri, Nov 5 2021 4:27 PM

Sanya Malhotra Gifts Herself New House In Juhu, Mumbai - Sakshi

Sanya Malhotra Is Hrithik Roshan's New Neighbour: దీపావ‌ళి పండ‌గ‌కు త‌నకు తానే ఓ ఇంటిని గిఫ్ట్ ఇచ్చుకుందో బాలీవుడ్ భామ‌. ముంబైలో ల‌గ్జ‌రీ ఇంటిని కొనుగోలు చేసింది దంగ‌ల్ బ్యూటీ స‌న్య మ‌ల్హోత్రా. ఇది హీరో హృతిక్ రోష‌న్ ఇంటి ప‌క్క‌నే ఉంద‌ట‌! పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. స‌న్య ముంబైలో జుహు ప్రాంతంలో నివ‌సిస్తున్న‌ స‌మీర్ భోజ్వానీ అనే వ్య‌క్తికి చెందిన ఇంటిని కొనుగోలు చేసింది. ఇది జుహు- వెర్సోవా లింక్ రోడ్‌లోని బేవ్యూ బిల్డింగ్‌లో ఉంది. స‌న్య‌, స‌న్య తండ్రి సునీల్ కుమార్ మల్హోత్రా రూ.14.3 కోట్లు వెచ్చించి ఆ ఇంటిని సొంతం చేసుకున్నారు. గ‌త నెల 14న ప్రాప‌ర్టీ ఆమె పేరుకు ట్రాన్స్‌ఫ‌ర్ అయిన‌ట్లు తెలుస్తోంది.

విశేష‌మేంటంటే గ‌తేడాది హృతిక్ రోష‌న్ 100 కోట్లు ఖ‌ర్చు పెట్టి ఇదే బిల్డింగ్‌లో రెండు అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేశాడు. తాజాగా స‌న్యా కూడా ఈ భ‌వంతిలోనే ఇల్లు కొన‌డంతో ఆమె హృతిక్‌కు పొరుగింటి అమ్మాయిగా మారిపోయింది. ఇక దంగ‌ల్ సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టిన స‌న్య తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు అందుకుంది. 'ప‌టాకా', 'బ‌దాయి హో', 'శ‌కుంత‌ల దేవి', 'లూడో', 'ప‌గ్లైట్' వంటి ప‌లు సినిమాల్లో న‌టించిన స‌న్య ప్ర‌స్తుతం 'మీనాక్షి సుంద‌రేశ్వ‌ర్' సినిమా చేస్తుంది. ఇది ఓటీటీలో రిలీజ్ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement