ఆ కలెక్షన్లు నిజం కాదు : ఆమిర్ టీం | Dangal Really Made 2,000 Crore | Sakshi
Sakshi News home page

ఆ కలెక్షన్లు నిజం కాదు : ఆమిర్ టీం

Published Tue, Jul 4 2017 11:29 AM | Last Updated on Tue, Sep 5 2017 3:12 PM

ఆ కలెక్షన్లు నిజం కాదు : ఆమిర్ టీం

ఆ కలెక్షన్లు నిజం కాదు : ఆమిర్ టీం

చైనాలో రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న దంగల్ కలెక్షన్లపై వినిపిస్తున్న వార్తలపై ఆమిర్ టీం స్పందించింది. ఇటీవల సంస్థ దంగల్ 2000 కోట్ల కలెక్షన్ మార్క్ దాటినట్టుగా ఇచ్చిన వార్తలను దంగల్ టీం తోసిపుచ్చింది. ఇప్పటికీ చైనా భారీ వసూళ్లను సాధిస్తున్న దంగల్, ఇప్పటి వరకు 1864 కోట్ల వసూళ్లు సాధించిట్టుగా క్లారిటీ ఇచ్చింది. అయితే 2000 కోట్ల మార్క్ను తమ సినిమా చేరుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

హర్యానాకు చెందిన రెజ్లర్ మహావీర్ సింగ్ ఫొగట్ జీవితకథ ఆధారంగా నితీష్ తివారీ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. భారత్లో రెండో హయ్యస్ట్ గ్రాసర్గా సినిమాగా నిలిచిన దంగల్ చైనాలో సంచలనాలు నమోదు చేసింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన నాన్ హాలీవుడ్ సినిమాల లిస్ట్లో ఐదో స్థానం సాధించిన దంగల్, మరిన్ని రికార్డ్లు సాధించే దిశగా దూసుకుపోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement