ఈ సినిమాలకు దారుణంగా పడిపోయిన వసూళ్లు.. కారణం ఇదే | Laal Singh Chaddha Raksha Bandhan Day 2 Box Office Collection | Sakshi
Sakshi News home page

Laal Singh Chaddha: నాగ చైతన్య సినిమాకు ఊహించని కలెక్షన్లు.. మరి ఇంతలా

Published Sat, Aug 13 2022 7:19 PM | Last Updated on Sun, Aug 14 2022 7:01 AM

Laal Singh Chaddha Raksha Bandhan Day 2 Box Office Collection - Sakshi

బాలీవుడ్‌ మిస్టర్ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం 'లాల్‌సింగ్‌ చద్ధా'. బెబో కరీనా కపూర్, అక్కినేని నాగ చైతన్య  కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఆస్కార్‌ విన్నింగ్‌ ఫిల్మ్‌ ‘ఫారెస్ట్‌ గంప్‌’కు హిందీ  రీమేక్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రానికి అద్వెత్‌ చందన్‌ దర్శకత్వం వహించారు. వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చ‌ర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై  ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్‌, సాంగ్స్‌, ట్రైలర్‌తో చిత్రంపై మంచి హైప్ ఏర్పడింది. భారీ అంచనాల మధ్య ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. 

అయితే 'లాల్‌ సింగ్‌ చద్ధా' విడుదలైన తొలిరోజు నుంచే నెగెటివ్‌ టాక్‌ను మూటగట్టుకుంది. అనుకన్నంత స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. సినిమా రిలీజ్‌ రోజైన గురువారం 11. 70 కోట్లను రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు శుక్రవారం 7.26 కోట్లకు పడిపోయింది. మొత్తంగా 'లాల్ సింగ్‌ చద్ధా' తొలి రెండు రోజుల్లో రూ. 18.96 కోట్లను మాత్రమే రాబట్టగలిగింది. అంటే కనీసం రూ. 20 కోట్ల మార్క్‌ను కూడా చేరుకోలేకపోయింది. కాగా సినిమా ప్రమోషన్స్‌ ప్రారంభం నుంచే 'బాయ్‌కాట్‌ బాలీవుడ్‌'లో భాగంగా 'లాల్‌ సింగ్‌ చద్ధా'పై సోషల్‌ మీడియాలో నెగెటివిటీ ఎక్కువగా ప్రచారం. 'బాయ్‌కాట్‌ లాల్‌ సింగ్‌ చద్ధా' అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌ కూడా అయింది.  అమీర్‌ ఖాన్‌ సినిమా ఇలా తక్కువ వసూళ్లు సాధించడానికి ఈ ట్రెండింగే కారణంగా తెలుస్తోంది. 

అలాగే 'బాయ్‌కాట్‌ బాలీవుడ్‌' సెగ ప్రభావం ఈ సినిమాతో పాటు మరో స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ చిత్రంపై కూడా పడింది. అన్నాచెళ్లెల్ల అనుబంధంగా తరకెక్కిన 'రక్షా బంధన్‌' చిత్రం కూడా ఆగస్టు 11నే విడుదలైంది. తొలి రోజైన గురువారం రూ. 8.20 కోట్లను సాధించిన 'రక్షా బంధన్‌' రెండో రోజు శుక్రవారం రూ. 6.40 కోట్లతో సరిపెట్టుకుంది. మొత్తంగా అమీర్‌ ఖాన్‌ చిత్రం కంటే తక్కువగా రూ. 14.60 కోట్ల కలెక్షన్లతో నెమ్మదిగా ముందుకుసాగుతోంది. ఈ రెండు చిత్రాల కలెక్షన్లను బట్టి చూస్తే 'బాయ్‌కాట్‌ బాలీవుడ్' ప్రభావం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement