
ముంబై: ‘దంగల్’ సినిమాలోని తన సహనటి సన్య మల్హోత్రాతో డేటింగ్ చేస్తున్నట్టు వస్తున్న వదంతులపై నటి ఫాతిమా సనా షేక్ స్పందించారు. ఓ ఇంటర్యూలో ఫాతిమాను దీనిపై ప్రశ్నించగా.. ‘ఆ వార్తలు చూడగానే మాకు నవ్వొచ్చింది. మేము మంచి స్నేహితులం. కానీ అందరూ మా స్నేహాన్ని తప్పుగా భావించారు’ అని చెప్పారు. ఇక సన్యాలో తనకు నచ్చిన విషయాలు ఏంటని అడగ్గా.. ‘‘తనలో నాకు మూడు విషయాలు బాగా నచ్చాయి. తన నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నా. సన్య ప్రతీది శుభ్రంగా ఉంచడానికి ఇష్టపడుతుంది. పని పట్ల ఆమె అంకితభావంతో ఉంటుంది. తనలో అది నాకు బాగా నచ్చింది’’ అంటూ చెప్పుకొచ్చారు. (సుశాంత్ ఆత్మహత్య : ఫేక్ సంతాపాలు అవసరమా?)
కాగా సన్య మల్హాత్రా, ఫాతిమాలు ‘దంగల్’లో అక్కాచెల్లెళ్లుగా నటించారు. తన విభిన్న మతపరమైన నేపథ్యం, పెంపకం గురించి మాట్లాడుతూ.. ‘‘ఇది లౌకిక భారతదేశానికి అనువైనది. మన దేశం ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ మనం చాలా వైవిధ్యంగా ఉంటాము. ఎవరికీ నచ్చినంటూ వారు ఉండొచ్చు. మన స్వంత మతాన్ని అనుసరిస్తూనే మనకు నచ్చిన వారిని ఎంచుకోవచ్చు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment