![Fatima Sana Shaikh on why Female Actors Are not Repeated by Directors](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/fatima1.jpg.webp?itok=pmNTozPa)
చాలామంది దర్శకులు చేసిన హీరోలతోనే మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తారు.. కానీ హీరోయిన్లను మాత్రం రిపీట్ చేయరు అంటోంది బాలీవుడ్ హీరోయిన్ ఫాతిమా సనా షైక్ (Fatima Sana Shaikh). అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించింది. ప్రస్తుతం ఈమె కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ఆప్ జైసా కోయ్. ఆర్ మాధవన్‌తో జోడీ కడుతున్న ఈ బ్యూటీ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.
మాధవన్ అంటే క్రష్
ఫాతిమా సనా షైక్ మాట్లాడుతూ.. నాకు మాధవన్ (R Madhavan) అంటే చాలా ఇష్టం, గౌరవం. ఆయన నా క్రష్ కూడా! ఆ విషయం ఆయనక్కూడా తెలుసు. నన్ను కూడా ఆయన ఎంతో గౌరవిస్తాడు. తనొక మేధావి.. ఎప్పటికప్పుడు కొత్త గ్యాడ్జెట్లు తీసుకొస్తుండేవాడు. వాటి గురించి చెప్తూ చాలా ఎగ్జయిట్ అయ్యేవాడు. ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం. ఇకపోతే దర్శకుడు అనురాగ్ బసు గురించి మీకో విషయం చెప్పాలి. ఆయన తెరకెక్కించిన మెట్రో ఇన్ డినో సినిమా సమయంలో తన ముందు ఓ డిమాండ్ పెట్టాను. ఆయన ఏ సినిమా తీసినా సరే అందులో కచ్చితంగా నన్ను తీసుకోవాలని కోరాను. కనీసం ఒక చిన్న పాత్ర ఆఫర్ చేసినా సరే కాదనుకుండా చేస్తానన్నాను.
డేట్స్ ఒకేసారి కుదరవుగా!
మెట్రో ఇన్ డినో సినిమా (Metro... In Dino) విడుదల ఎందుకు ఆలస్యం అవుతుందని అందరూ అంటున్నారు. అనురాగ్ మంచి సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం కొంత సమయం తీసుకుంటున్నాడు. అలాగే నటీనటులను మేనేజ్ చేయడం కూడా అంత ఈజీ కాదు కదా.. అందరి డేట్స్ ఒకేరోజు దొరకడానికి ఎంతో ఇబ్బందవుతుంది అని చెప్పుకొచ్చింది.
కొందరికే మినహాయింపు
సాధారణంగా దర్శకులు హీరోయిన్లను తమ సినిమాల్లో రిపీట్ కానివ్వరు. కానీ కొంతమంది దీనికి మినహాయింపు. అందులో ఒకరే ఫాతిమా. ఈ అంశం గురించి ఫాతిమా మాట్లాడుతూ.. హీరోలు కలెక్షన్లు తీసుకొస్తారు. ఉదాహరణకు షారూఖ్ ఖాన్ తన సినిమాకు ఎక్కువ వసూళ్లు తెచ్చాడు అంటే ఎక్కువమంది ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించినట్లే కదా! దీన్ని పరగణనలోకి తీసుకుని దర్శకుడు నటీనటులను ఎంపిక చేసుకుంటాడు.
అప్పుడు మాత్రమే..!
ఈ క్రమంలోనే ఏ హీరోతో కాంబినేషన్‌లో ఎక్కువ హిట్లు అందుకున్నారో వారితో మరోసారి కలిసి సినిమా చేసేందుకు డైరెక్టర్లు ఇష్టపడతారు. కానీ హీరోయిన్ల విషయంలో.. చాలా తక్కువమందితోనే రిపీట్ చేస్తారు. కంగనా రనౌత్, ఆలియా భట్, దీపికా పదుకొణె.. ఇలా ఈ జాబితాలో కొద్దిమందే ఉంటారు. మేము నటించిన సినిమాలకు పెద్ద ఎత్తున కలెక్షన్స్ తీసుకొస్తే అప్పుడు దర్శకులు మాకు మరో అవకాశం ఇస్తారు అని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment