'అంత ప్రశాంతమైన డైరెక్టర్‌ను చూడలేదు'
ముంబై: మరాఠీ నటుడు గిరీష్ కులకర్ణి.. దంగల్ దర్శకుడు నితీష్ తివారిపై పొగడ్తల వర్షం కురిపించాడు. అసలు అంత ప్రశాంతంగా పనిచేసుకుపోయే దర్శకుడిని తాను ఇంతవరకు చూడలేదని వెల్లడించాడు.
అమీర్ ఖాన్ హీరోగా నటించిన దంగల్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కోచ్ పాత్రలో నటించిన కులకర్ణి శనివారం చిత్ర విశేషాలను మీడియాతో పంచుకుంటూ.. ఇంత భారీ ప్రాజెక్టును దర్శకుడు విజయవంతంగా చేపట్టడానికి స్పష్టమైన విజన్‌తో పనిచేయడమే కారణం అని పేర్కొన్నాడు. తన నటుల వద్ద నుంచి సలహాలు తీసుకోవడంలో సైతం నితీష్ ముందుంటారని వెల్లడించారు.