ఒళ్లు జలదరించేలా 'దంగల్' ఫస్ట్ లుక్ | Aamir shares first look of 'Dangal', leaves fans curious | Sakshi
Sakshi News home page

ఒళ్లు జలదరించేలా 'దంగల్' ఫస్ట్ లుక్

Published Mon, Sep 21 2015 6:04 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఒళ్లు జలదరించేలా 'దంగల్' ఫస్ట్ లుక్ - Sakshi

ఒళ్లు జలదరించేలా 'దంగల్' ఫస్ట్ లుక్

ముంబయి: విభిన్నమైన కథలను ఎంచుకొని సామాజిక స్పృహ కలిగించేందుకు ప్రయత్నించే ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మరోసారి తన నటన విశ్వరూప ప్రదర్శన చేయనున్నారు. ఆయన ఓ ప్రముఖ రెజ్లర్ జీవిత కథను ఆధారంగా తీసుకొని హీరోగా నటిస్తున్న 'దంగల్' చిత్రం తొలి పోస్టర్ను సోమవారం విడుదల చేశారు. చూసిన వారందరికి ఒళ్లు జలదరించేలా ఈ పోస్టర్ ఉండటం విశేషం.

పంజా విసిరేముందు సింహం చూసేముందు దాని చూపు ఎంతటి తీక్షణంగా కనిపిస్తుందో అంతే స్థాయిలో చూస్తూ బురదలో నుంచి ముఖం మాత్రమే బయటకు కనిపించేలా ఉన్న ఈ చిత్ర తొలి పోస్టర్ అమితంగా ఆకట్టుకుంటోంది. సెప్టెంబర్ 23 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా దానికి రెండు రోజుల ముందే అభిమానుల కోసం ట్విట్టర్ ద్వారా ఈ చిత్ర పోస్టర్ను విడుదల చేశారు. ప్రముఖ రెజ్లర్ మహవీర్ పోగట్ జీవిత కథ ఆధారంగా దంగల్ చిత్రాన్ని తీస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement