రూ. 400 కోట్లు మార్క్‌ దాటిన కలెక్షన్లు | Dangal worldwide box-office collection : past the 400-crore mark | Sakshi
Sakshi News home page

రూ. 400 కోట్లు మార్క్‌ దాటిన కలెక్షన్లు

Jan 2 2017 5:08 PM | Updated on Sep 5 2017 12:12 AM

ఆమిర్ ఖాన్‌ నటించిన బాలీవుడ్‌ సినిమా దంగల్‌ బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది.

ముంబై: ఆమిర్ ఖాన్‌ నటించిన బాలీవుడ్‌ సినిమా దంగల్‌ బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ స్పోర్ట్స్‌ డ్రామా ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 400  కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టింది. దేశ వ్యాప్తంగా 270 కోట్లు, ఓవర్సీస్‌లో 141 కోట్ల రూపాయలను వసూలు చేసింది. మొత్తం 411 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.

డిసెంబర్‌ 23న విడుదలైన దంగల్‌ తొలివారం దేశీయ మార్కెట్లో 197.53 కోట్ల రూపాయలను వసూలు చేసింది. 2016లో తొలి వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇదే కావడం విశేషం. గతేడాది విడుదలైన సల్మాన్‌ ఖాన్‌ సినిమా సుల్తాన్‌ తొలివారంలో 180.36 కోట్ల రూపాయలు వసూలు చేయగా, దంగల్‌ ఈ రికార్డును బ్రేక్‌ చేసింది. హరియాణాలోని భివానీ జిల్లాలో ఓ మారుమూల గ్రామానికి చెందిన కుస్తీ వీరుడు మహావీర్‌ సింగ్‌ ఫొగట్‌ జీవిత కథ ఆధారంగా దంగల్‌ తెరకెక్కింది. నితీష్‌ తివారీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాక్షి తన్వార్‌, ఫాతిమా సనా షేక్‌, సన్యా మల్హోత్రా, అపర్‌శక్తి ఖుర్రాన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement