ఏడాది చివర్లో దంగల్‌ రికార్డు కలెక్షన్లు | Dangal inches close to Rs 200 crore | Sakshi
Sakshi News home page

ఏడాది చివర్లో దంగల్‌ రికార్డు కలెక్షన్లు

Published Fri, Dec 30 2016 3:11 PM | Last Updated on Mon, Sep 4 2017 11:58 PM

ఏడాది చివర్లో దంగల్‌ రికార్డు కలెక్షన్లు

ఏడాది చివర్లో దంగల్‌ రికార్డు కలెక్షన్లు

ముంబై: బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్‌ నటించిన స్పోర్ట్స్‌ డ్రామా "దంగల్‌' బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమా రికార్డు వసూళ్లు సాధిస్తోంది. తొలివారం 197.53 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ ఏడాది తొలి వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇదే కావడం విశేషం. ఈ ఏడాది విడుదలైన సల్మాన్‌ ఖాన్‌ సినిమా సుల్తాన్‌ తొలివారంలో 180.36 కోట్ల రూపాయలు వసూలు చేయగా, దంగల్‌ ఈ రికార్డును బ్రేక్‌ చేసింది.  

ఈ నెల 23న విడుదలైన దంగల్‌ నిలకడగా కలెక్షన్లు సాధిస్తోంది. ఈ రోజుకు (శుక్రవారం) 200 కోట్ల మార్క్‌ దాటుతుందని అంచనా. ఈ వీకెండ్‌కు ఈ సినిమా 250 కోట్ల రూపాయల వసూళ్లు సాధించవచ్చని బాలీవుడ్‌ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ అంచనా వేశారు. హరియాణాలోని భివానీ జిల్లాలో ఓ మారుమూల గ్రామానికి చెందిన కుస్తీ వీరుడు మహావీర్‌ సింగ్‌ ఫొగట్‌ జీవిత కథ ఆధారంగా దంగల్‌ తెరకెక్కింది. నితీష్‌ తివారీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాక్షి తన్వార్‌, ఫాతిమా సనా షేక్‌, సన్యా మల్హోత్రా, అపర్‌శక్తి ఖుర్రాన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement