ఆల్‌టైమ్‌ రికార్డులను బద్దలు కొడుతుందా? | Aamir Khan starrer 'Dangal' emerges as all time blockbuster | Sakshi
Sakshi News home page

ఆల్‌టైమ్‌ రికార్డులను బద్దలు కొడుతుందా?

Published Fri, Jan 6 2017 7:36 PM | Last Updated on Tue, Sep 5 2017 12:35 AM

ఆల్‌టైమ్‌ రికార్డులను బద్దలు కొడుతుందా?

ఆల్‌టైమ్‌ రికార్డులను బద్దలు కొడుతుందా?

ముంబై: ఆమిర్ ఖాన్‌ నటించిన బాలీవుడ్‌ సినిమా దంగల్‌ బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్లను సాధిస్తోంది. గతేడాది విడుదలైన సినిమాలలో ఇదే అత్యధిక వసూళ్లు రాబట్టింది. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ స్పోర్ట్స్‌ డ్రామా ఆల్‌ టైమ్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

డిసెంబర్‌ 23న విడుదలైన దంగల్‌కు ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 313.50 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. తొలివారం 197.54 కోట్లు, రెండోవారం 115.96 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇక ఓవర్సీస్‌లో దాదాపు 150 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆమిర్‌ నటించిన పీకే సినిమా బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించింది. దంగల్‌కు ఇలాగే నిలకడగా కలెక్షన్లు వస్తే పీకే రికార్డును బ్రేక్‌ చేసే అవకాశముందని బాలీవుడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆమీర్‌ తన రికార్డును తానే బద్దలు కొడతాడో లేదో చూడాలి.

హరియాణాలోని భివానీ జిల్లాలో ఓ మారుమూల గ్రామానికి చెందిన కుస్తీ వీరుడు మహావీర్‌ సింగ్‌ ఫొగట్‌ జీవిత కథ ఆధారంగా దంగల్‌ తెరకెక్కింది. నితీష్‌ తివారీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాక్షి తన్వార్‌, ఫాతిమా సనా షేక్‌, సన్యా మల్హోత్రా, అపర్‌శక్తి ఖుర్రాన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement