లుక్.. కిక్..! | Aamir Khan's New Film “Secret Superstar” Hits The Floor | Sakshi
Sakshi News home page

లుక్.. కిక్..!

Published Sat, Oct 1 2016 1:14 AM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM

లుక్.. కిక్..!

లుక్.. కిక్..!

సినిమాల్లో నటించడమే కాదు, వాటిని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో.. ప్రేక్షకుల్లోకి ఎలా తీసుకువెళ్లాలో ఆమిర్‌ఖాన్‌కి బాగా తెలుసు. తన లుక్‌తోనే సినిమాకి కిక్ తీసుకురాగల నేర్పరి. ప్రస్తుతం ఆమిర్ నటిస్తున్న సినిమా ‘దంగల్’. మల్లయోధుడు మహవీర్ సింగ్ ఫోగట్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆమిర్ యువకుడిగా, ఇద్దరమ్మాయిల తండ్రిగా రెండు పార్శ్వాలున్న పాత్రలో నటిస్తున్నారు. ఆ రెండు లుక్స్ ఎప్పుడో విడుదలయ్యాయి.
 
  తాజాగా ప్రమోషనల్ సాంగ్ కోసం ఫొటోలో మీరు చూస్తున్న కొత్త లుక్‌లోకి వచ్చేశారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ సినిమా కోసం ఇటీవల ఆమిర్‌ఖాన్ కొత్త లుక్‌లో కనిపించారు. ఈ లుక్ కూడా ఆ సినిమా కోసమే అనుకున్నారు. అసలు విషయం ఏంటంటే.. ‘దంగల్’లో ఆన్ స్క్రీన్ కూతుళ్లుగా నటిస్తున్న ఫాతిమా సనా షైక్, సన్యా మల్హోత్రాలతో కలసి ఆమిర్ షూట్ చేస్తున్న ప్రమోషనల్ సాంగ్‌లో లుక్ ఇది. ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement