'సుల్తాన్'కు విలక్షణ నటుడి ప్రశంస | 'Dangal' Aamir Khan has big words for Salman Khan's 'Sultan' | Sakshi
Sakshi News home page

'సుల్తాన్'కు విలక్షణ నటుడి ప్రశంస

Published Thu, Jul 7 2016 5:26 PM | Last Updated on Mon, Sep 4 2017 4:20 AM

'సుల్తాన్'కు విలక్షణ నటుడి ప్రశంస

'సుల్తాన్'కు విలక్షణ నటుడి ప్రశంస

ముంబై: సల్మాన్ ఖాన్ 'రేప్' వ్యాఖ్యలను తప్పుబట్టిన మిస్టర్ ఫర్పెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ 'సుల్తాన్' సినిమా విషయంలో మాత్రం అతడికి అండగా నిలిచాడు. ఈ సినిమా చాలా బాగుందని చెప్పారు. 'సుల్తాన్' సినిమా చూసిన తర్వాత తన స్పందనను ట్విటర్ ద్వారా తెలిపాడు. 'బుధవారం రాత్రి సుల్తాన్ సినిమా చూశాను. అద్భుతంగా ఉంది. అలీ అబ్బాస్ జాఫర్ రచయితగా, దర్శకుడిగా సత్తా చాటాడు. సల్మాన్, అనుష్క సూపర్ గా నటించారు. ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొడుతుంది. ఈ సినిమాను తప్పకుండా చూడండి. మీ అందరికీ నచ్చుతుంద'ని ఆమిర్ ట్వీట్ చేశాడు.

రంజాన్ కానుకగా బుధవారం విడుదలైన 'సుల్తాన్' మొదటిరోజు ఏకంగా రూ. 36.5 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది. ఈ సినిమాలో సల్మాన్ మల్లయోధుడిగా నటించాడు. ఇక ఆమిర్ తాజా చిత్రం 'దంగల్' సినిమా డిసెంబర్ లో విడుదలకానుంది. ప్రముఖ రెజ్లర్ మహవీర్ పొగట్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఆమిర్ ఖాన్ 'మహవీర్' పాత్రలో నటిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement