దంగల్‌పై ఆ వార్తల్లో నిజం లేదు | contrary to some media reports Aamir khan Dangal not to be released in Pakistan | Sakshi
Sakshi News home page

దంగల్‌పై ఆ వార్తల్లో నిజం లేదు

Published Tue, Dec 20 2016 5:28 PM | Last Updated on Mon, Sep 4 2017 11:12 PM

దంగల్‌పై ఆ వార్తల్లో నిజం లేదు

దంగల్‌పై ఆ వార్తల్లో నిజం లేదు

ముంబై: బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ నటించిన దంగల్‌ చిత్రం పాకిస్తాన్‌లో విడుదలవుతుందంటూ వచ్చిన వార్తలను ఆ చిత్ర డిస్ట్రిబ్యూటర్లు ఖండించారు. దంగల్‌ చిత్రాన్ని పాకిస్తాన్‌లో విడుదల చేయడం లేదని ఆ చిత్ర డిస్ట్రిబ్యూటర్స్‌ ప్రతినిధి మంగళవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.

ఉడీ ఉగ్రదాడుల అనంతరం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారతీయ చిత్రాలను ప్రదర్శించబోం అని పాకిస్తాన్‌ థియెటర్ల యజమానులు నిర్ణయం తీసుకున్నారు. ఇలా భారతీయ చిత్రాలను నిలిపివేయడం మూలంగా రెండు నెలల్లో వారు సుమారు రూ. 15 కోట్లు నష్టపోయారు. దీంతో.. సోమవారం నుంచి ఈ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు థియెటర్ల యజమానులు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే దంగల్‌ చిత్రం పాకిస్తాన్‌లో కూడా విడుదలవుతుందంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. రెజ్లర్‌ మహవీర్‌ ఫోగట్‌ జీవితకథతో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం విడులవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement