ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని సినిమా థియేటర్ల యజమానులు అనూహ్య నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటి వరకు భారతీయ చిత్రాలపై వారికి వారుగా విధించుకున్న నిషేధాన్ని ఎత్తివేయబోతున్నారు. ఈ వారం ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి భారత సైనికులపై రాత్రికి రాత్రి పాక్ ముష్కరులు దాడులు చేసి పలువురిని పొట్టన బెట్టుకున్న అనంతరం భారత్‌లో పనిచేస్తున్న పాక్ సినిమా వాళ్లంతా దేశం విడిచి వెళ్లాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో తమ వారిని అవమానిస్తారా అని పాక్ లోని సినిమా సంఘాల వాళ్లు, థియేటర్ల యజమాన్యాలు ఎవరికి వారుగా భారత సినిమాలపై నిషేధం విధించారు. అయితే, ఈ చిత్రాలపై బ్యాన్ విధించినప్పటి నుంచి వారి పరిస్థితి అద్వానంగా మారింది. ఈ నేపథ్యంలో దంగల్ సినిమాను ఆశ్రయంగా చేసుకొని భారతీయ చిత్రాల విడుదలపై ఉన్న నిషేధాన్ని సోమవారం రద్దు చేయాలని నిర్ణయిస్తున్నారు. అదీ కాకుండా ఆమిర్ ఖాన్ కు భారత్ లో ఎంత క్రేజ్ ఉందో.. పాక్ లో కూడా అంతే క్రేజ్ ఉంది.
పాక్ సినిమా హాళ్ల అనూహ్య నిర్ణయం
Published Mon, Dec 19 2016 11:14 AM | Last Updated on Sat, Mar 23 2019 8:36 PM
Advertisement