
దంగల్ టీంకు పవన్ కళ్యాణ్ ప్రశంసలు
తన సోషల్ మీడియా పేజ్లో ఎక్కువగా రాజకీయాలపైనే స్పందించే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా సినిమాకు సంబంధించిన ట్వీట్ చేశాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న దంగల్ సినిమా నటీనటులు సాంకేతిక నిపుణులపై పవన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ' ఇటీవల దంగల్ సినిమా చూసిన నేను నా అభిప్రాయాన్ని వ్యక్తీకరించకుండా ఉండలేకపోయాను. ఆమిర్ ఖాన్ తన అద్భుతమైన నటనతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నాడు.
అంత గొప్ప నటుడు భారతీయుడు కావటం మనకు గర్వకారణం. సినిమాకు పనిచేసిన ఇతర నటీనటులు సాంకేతిక నిపుణులకు నా అభినందనలు. దర్శకుడు నితీష్ తివారీ.. ప్రేక్షకుడు కథలో లీనమయ్యేలా సినిమాను తెరకెక్కించారు. గీతా ఫొగట్ పాత్రలో నటించిన జైరా వసీం, ఫాతిమా సనా షేక్, బబితా ఫొగట్గా నటించిన సుహానీ భట్నాగర్, సన్యా మల్హోత్రాలకు నా ప్రత్యేక అభినందనలు. దంగల్ సినిమా స్త్రీ సాధికారత గురించి మనందరం మరోసారి ఆలోచించేలా చేసింది'. అంటూ ట్వీట్ చేశాడు.
— Pawan Kalyan (@PawanKalyan) 1 January 2017
— Pawan Kalyan (@PawanKalyan) 1 January 2017
— Pawan Kalyan (@PawanKalyan) 1 January 2017