
'మూడు రోజుల్లో వందకోట్లు'
ఆమిర్ బాక్సాఫీస్ మీద తన ఆదిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. పీకే సినిమాతో ఇండియాలోనే హయ్యస్ట్ కలెక్షన్లు సాధించిన రికార్డ్ సొంతం చేసుకున్న ఆమిర్, దంగల్ తోనూ మరోసారి సత్తా చాటుతున్నాడు. రిలీజ్కు ముందు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న దంగల్, రిలీజ్ తరువాత కూడా అదే హవా కంటిన్యూ చేసింది. భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన దంగల్ డిమోనిటైజేషన్ ఎఫెక్ట్ను దాటి భారీ వసూళ్లను రాబడుతోంది.
శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అయిన ఈ సినిమా 29.78 కోట్లు సాధించింది. శని, ఆది వారాల్లో కలెక్షన్లు మరింతగా పెరిగే ఛాన్స్ ఉండటంతో తొలి మూడు రోజుల్లోనే దంగల్, వంద కోట్ల క్లబ్లో చేరుతుందని తెలిపారు ప్రముఖ బాలీవుడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్. సూపర్ హిట్ మౌత్ టాక్తో దూసుకుపోతున్న దంగల్ మరోసారి బాక్సాఫీస్ రికార్డ్లను తిరగరాయటం కాయంగా కనిపిస్తోంది.
#Dangal wrestles demonetisation... Sets the BO on fire... Ends the lull phase... Fri ₹ 29.78 cr [incl ₹ 59 lacs from Tamil and Telugu].
— taran adarsh (@taran_adarsh) 24 December 2016