ఈ పాపులర్ నటిని గుర్తుపట్టగలరా..! | we can not easily identify this actress real pic | Sakshi

ఈ పాపులర్ నటిని గుర్తుపట్టగలరా..!

Published Thu, Jan 19 2017 9:45 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 AM

ఈ పాపులర్ నటిని గుర్తుపట్టగలరా..!

ఈ పాపులర్ నటిని గుర్తుపట్టగలరా..!

ఈ ఫొటోలో ఉన్న పాపులర్ నటి చిన్ననాటి ఫొటో చూసి ఆమె ఎవరో గుర్తుపట్టడం చాలా కష్టం. ఎందుకంటే మూవీలో ఆమె గెటప్.. రియల్ లైఫ్‌లో ఆమెను చూస్తే పోల్చుకోవడం అంత తేలికకాదు. అయితే ఆమె ఎవరో చెబితే మాత్రం నటి ఏ మూవీలో నటించిందో, ఏ పాత్ర పోషించిందో ఇట్టే చెప్పేస్తారు. ఇటీవల ఆమె నటించిన ఓ మూవీ భారతదేశ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించి రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. సినిమా కోసం ఆమె ఆహార్యంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ నటి మరెవరో కాదు ఫాతిమా సనా షేక్. ఇంకా గుర్తుకురాలేదా.. హర్యానా రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్ తన కూతుళ్లను చాంపియన్లుగా తీర్చిదిద్దిన తీరును కథాంశంగా తీసుకుని తీసిన దంగల్ మూవీలో గీతా ఫోగట్ పాత్రలో నటించి అందర్నీ మెప్పించింది.

దంగల్ సినిమాలో రెజ్లర్ గీతా ఫోగట్ చిన్నప్పటి పాత్రలో కశ్మీరీ నటి జైరా వసీం నటించగా, కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొన్న పెద్ద గీతా ఫోగట్ పాత్రలో ఫాతిమా సనా షేక్ నటించింది. రెజ్లర్ పాత్ర కోసం ఫాతిమా ఎంతో శ్రమించిందని చెప్పవచ్చు. రెజ్లింగ్ మ్యాట్‌పై అద్భుతం చేసి భారత్‌కు స్వర్ణాన్ని సాధించిన గీతా ఫోగట్ పాత్రలో నటించి క్యారెక్టర్‌కు జీవం పోసింది ఫాతిమా. అయితే దంగల్‌లో హెయిర్ కట్ చాలా చిన్నగా ఉండటంతో ఆమె రియల్ ఫొటోలను చూసి అంత తేలికగా ఆమెను గుర్తించలేరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement