బాలీవుడ్ మిస్టర్ ఫెర్ఫెక్ట్ అనగానే అందరికీ హీరో ఆమిర్‌ఖాన్ గుర్తొస్తాడు. డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుండేవాడు. అయితే గతేడాది 'లాల్ సింగ్ చద్దా' సినిమాతో దెబ్బ గట్టిగా తగిలింది. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం దారుణంగా ఫెయిలయ్యేసరికి ఆలోచనలో పడిపోయాడు. కొన్నాళ్లపాటు నటన, సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. అలా అని ఖాళీగా ఏం లేడు. చేతినిండా సినిమాలతో బిజీగానే ఉన్నాడు.
(ఇదీ చదవండి: అభిమానుల్ని మోసం చేస‍్తున్న స్టార్ హీరోలు!)
మాజీభార్యతో కలిసి
ఆమిర్ ఖాన్.. తొలుత నిర్మాత రీనా దత్తాని పెళ్లి చేసుకున్నాడు. 16 ఏళ్లపాటు కాపురం చేసిన ఈ జంట.. 2002లో విడిపోయింది. 2005లో డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కిరణ్ రావ్ ని పెళ్లి చేసుకున్న ఆమిర్.. ఈమెతోనూ 16 ఏళ్లు సంసారం చేసి 2021లో విడాకులు ఇచ్చేశాడు. రిలేషన్ లో విడిపోయినప్పటికీ.. ఫ్రొఫెషనల్ గా వీళ్లు కలిసే పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమిర్ నిర్మాణంలో కిరణ్ ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తోంది. త్వరలో ఇది విడుదల కానుంది.
రూమర్ గర్ల్‌ఫ్రెండ్‌తోనూ
ప్రస్తుతం ఆమిర్ ఖాన్.. 'దంగల్' ఫేమా ఫాతిమా సనా షేక్ తో రిలేషన్ లో ఉన్నాడని, త్వరలో పెళ్లి చేసుకుంటాడని గత కొన్నాళ్లుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ విషయం పక్కనబెడితే.. ఆమిర్ ఖాన్ ప్రస్తుతం నిర్మిస్తున్న నాలుగు మూవీస్ లోని ఒక దానిలో ఫాతిమా హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ సూపర్ హిట్ 'జయజయజయహే' రీమేక్ గా దీన్ని తీస్తున్నారు. ఇది కూడా త్వరలో రిలీజ్ కానుంది. అటు మాజీ భార్య ఇటు ప్రేయసిని ఆమిర్ ఖాన్ భలే బ్యాలెన్స్ చేస్తున్నాడని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.
(ఇదీ చదవండి: సలార్-కేజీఎఫ్ కనెక్షన్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత)
Comments
Please login to add a commentAdd a comment