‘దంగల్‌’కు చైనాలో వెయ్యి కోట్లు | Dangal earns record₹1000 crore in China | Sakshi
Sakshi News home page

‘దంగల్‌’కు చైనాలో వెయ్యి కోట్లు

Published Wed, May 31 2017 4:31 AM | Last Updated on Tue, Sep 5 2017 12:22 PM

‘దంగల్‌’కు చైనాలో వెయ్యి కోట్లు

‘దంగల్‌’కు చైనాలో వెయ్యి కోట్లు

బీజింగ్‌: భారత్‌లో వసూళ్ల రికార్డు సృష్టించిన ఆమిర్‌ ఖాన్‌ చిత్రం ‘దంగల్‌’.. చైనాలోనూ దుమ్ము రేపుతోంది. చైనాలో వెయ్యికోట్ల రూపాయల వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుకెక్కింది. మొత్తం చైనా సినీ చరిత్రలోనే ఇంత మొత్తాన్ని సాధించిన సినిమాల్లో 33వదిగా మరో రికార్డునూ సొంతం చేసుకుంది. చైనా కరెన్సీలో ఒక బిలియన్‌ ఆర్‌ఎంబీలను దంగల్‌ వసూలు చేసిందని ‘మయన్‌’ వెబ్‌సైట్‌  తెలిపింది. చైనాలో ‘మయన్‌’ ప్రముఖ టికెట్‌ బుకింగ్‌ వెబ్‌సైట్‌. చైనాలో దంగల్‌ను మే 5న విడుదల చేశారు. అప్పటి నుంచి 15 రోజుల పాటు ఈ సినిమా అక్కడి బాక్సాఫీస్‌ వద్ద తొలి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఆ స్థానాన్ని ‘పైరేట్స్‌ ఆఫ్‌ ది కరీబియన్‌ 5’ పొందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement