అంధుల కోసం దంగల్‌ స్పెషల్‌ షో! | Dangal Special Show for the blind | Sakshi
Sakshi News home page

అంధుల కోసం దంగల్‌ స్పెషల్‌ షో!

Published Wed, Aug 9 2017 10:39 PM | Last Updated on Wed, Apr 3 2019 4:04 PM

అంధుల కోసం దంగల్‌ స్పెషల్‌ షో! - Sakshi

అంధుల కోసం దంగల్‌ స్పెషల్‌ షో!

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అంధుల కోసం దంగల్‌ ప్రత్యేక షోను వేస్తున్నారు. అంధుల కోసం సినిమాను ఎలా ప్రదర్శిస్తారనే కదా..? సాధారణంగా ఇతర భాషా చిత్రాలు చూసేటప్పుడు ఆ సినిమాను అర్థం చేసుకోవడం కోసం కింద మనకు పరిచయమున్న భాషలో సబ్‌ టైటిల్స్‌ వేస్తారు. అచ్చంగా అంధుల కోసం కూడా ఇప్పుడు అదే పనిచేస్తున్నారు. అయితే సబ్‌టైటిల్స్‌ టెక్స్ట్‌ రూపంలో కాకుండా ఆడియో రూపంలో వేస్తున్నారు. దీనివల్ల అంధులు కూడా సినిమాను సులభంగా అర్థం చేసుకుంటారు.

నితీశ్‌ తివారీ దర్శకత్వం వహించిన దంగల్‌ సినిమాలో బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌ మల్లయోధుడిగా ప్రధానపాత్ర పోషించగా సాక్షి తన్వర్, ఫాతిమా సనా షేఖ్, జైరా వాసిమ్‌ ఇతర పాత్రలు పోషించారు. ప్రముఖ రెజ్లర్‌ మహావీర్‌సింగ్‌ ఫోగట్, గీతాసింగ్‌ ఫోగట్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయి వసూళ్లు సాధించింది. ఆడపిల్లల్లో ఎంతో స్ఫూర్తిని నింపిన ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న జీ సినిమాలో ప్రసారం చేయనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement