ఈ ఏడాది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలీవుడ్ చిత్రం 'దంగల్'. ఏడాదికి ఒకే సినిమా .. అది కూడా పూర్తి మనస్సుపెట్టి త్రికరణ శుద్ధిగా తీస్తాడని ఆమిర్‌ఖాన్‌కు పేరు. ఈ మిస్టర్ పర్ఫెక్ట్.. రెజ్లింగ్‌యోధుడు మహవీర్‌సింగ్ ఫోగట్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కించిన 'దంగల్' సినిమా మరో రెండురోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్ స్టార్లకు థియేటర్‌లో ప్రత్యేక షో వేయించి ఆమిర్‌ఖాన్ మంగళవారం చూపించారు. ఈ షోకు ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, మహవీర్‌సింగ్ ఫోగట్ కుటుంబసభ్యులు కూడా హాజరయ్యారు. ఇప్పటికే ఈ సినిమాను కరణ్ జోహార్, షబానా ఆజ్మీ వంటి ప్రముఖులు చూసేశారు.
మహిళా సాధికారిత, క్రీడల్లో అమ్మాయిలను ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో తీసిన ఈ సినిమాలో రెజ్లింగ్ క్రీడాకారుడిగా, తన కూతుళ్లకు మల్లయుద్ధం నేర్పించే తండ్రిగా రెండు విభిన్నమైన పాత్రలో ఆమిర్ కనిపించబోతున్నారు. ఇప్పటికే ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమాను చూసి బాలీవుడ్ ప్రముఖులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో గొప్ప చిత్రంగా 'దంగల్' నిలిచిపోతుందంటూ ప్రశంసల జల్లు కురిపించారు. ఆమిర్ నటనను, సినిమాను వేనోళ్ల కొనియాడారు. ఇంతకు వారు ఏమన్నారంటే..
'నేను చాలాకాలం నుంచి చూస్తున్న సినిమాల్లో ఉత్తమ సినిమా 'దంగల్'. మున్ముందు కూడా ఒక గొప్ప సినిమాగా ఇది నిలిచిపోతుంది. సెల్యూట్ ఆమిర్ సర్- శిరీష్ కుందర్, ప్రముఖ దర్శకుడు
ఎంత అద్భుతమైన సినిమా దంగల్! దేశ క్రీడలకు, మహిళలకు ఈ సినిమా ఒక ముఖ్యమైన ఈవెంట్. ఆమిర్‌ఖాన్ మరోసారి మనలో స్ఫూర్తి నింపుతారు- అర్జున్ కపూర్, బాలీవుడ్ హీరో
దంగల్ చిత్రబృందానికి తలవొంచి ప్రమాణం చేస్తున్నా. అద్భుతమైన స్ర్కీన్‌ప్లే. సంగీతం. ఆమిర్‌ఖాన్ ఇతర నటులు అద్భుతంగా నటించారు- మిలింద దేవరా, రాజకీయ నాయకుడు
దంగల్‌లో ఆమిర్ ల్యాండ్‌మార్క్ పర్ఫార్మెన్స్ చూపించారు. ఇద్దరు అమ్మాయిలు కూడా అద్భుతంగా నటించారు. దర్శకుడు నితీశ్ తివారీ బహుముఖ భావోద్వేగాలతో సినిమాను రూపొందించారు- ప్రసూన్ జోషి
'దంగల్' సెలబ్రిటీ రివ్యూ వచ్చేసింది..
Published Wed, Dec 21 2016 11:41 AM | Last Updated on Mon, Sep 4 2017 11:17 PM
Advertisement
Advertisement