దంగల్ మరో ఘనవిజయం | Dangal earns Rs 374.95 cr: How Aamir Khan’s blockbuster saved theatre owners | Sakshi
Sakshi News home page

దంగల్ మరో ఘనవిజయం

Published Sat, Jan 21 2017 11:48 AM | Last Updated on Sat, Aug 11 2018 6:09 PM

దంగల్ మరో ఘనవిజయం - Sakshi

దంగల్ మరో ఘనవిజయం

ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్  బ్లాక్ బస్టర్ మూవీ దంగల్ మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.  డీమానిటైజేషన్  ప్రతికూల ప్రభావంతో నష్టాలపాలైన  థియేటర్ యజమానుల పాలిట వరప్రసాదంలా ఆదుకుంది ఈ చిత్రం. విలక్షణ చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ గా మారిన అమీర్  తాజా చిత్రం దంగల్  రూ.375 కోట్ల  వసూళ్లను అధిగమించింది. దీంతో థియేటర్  యజమానులు సంబరాలు చేసుకుంటున్నారు.  5వ  వారానికి మొత్తం రూ.376.14 కోట్లను  ఆర్జించింది.  ప్రముఖ  బాలీవుడ్ సినీ విమర్శకులు తరన్ ఆదర్శ్ దంగల్ వసూళ్ల పరంపరను ట్వీట్  చేశారు.

క్రిస్మస్ బొనాంజాగా థియేటర్లను పలకరించిన  బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తాజా చిత్రం దంగల్  కలక్షన్ల సునామీ సృష్టిస్తోంది.  దీంతో గత రెండేళ్లుగా (2015,2016) నష్టాలను మూట గట్టుకుంటున్న సింగిల్ స్ర్కీన్ థియేటర్లకు లాభాల పంట పడింది.  సింగిల్ స్ర్కీన్  థియేటర్ల యజమానులు అమీర్ కు  కృతజ్ఙతలు తెలుపుతూ లేఖ రాయడమే ఇందుకు నిదర్శనం.  

సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానుల భావోద్వేగ ఉత్తరంపై  బాక్స్ ఆఫీస్ కింగ్ అమీర్ ఆనందం వ్యక్తం చేశారు. తాను ప్రేమించే.. ఇష్టపడే పనిని  చేసే అవకాశం అందరికీ రాదనీ, కానీ తనకు అలాంటి అవకాశం రావడం తన అదృష్టమని చెప్పారు.  కెరీర్ లో అన్నీ అసాధారణ,మైన రిస్కీ మూవీలనే  చేసానని చెప్పుకొచ్చారు. అందుకు   తాజా ఉదాహరణ 'దంగల్'  సినిమానే అన్నారు.

కాగా   2016  కలెక్షన్ల పరంగా బోసిపోయిన బాలీవుడ్ కు దంగల్ కలెక్షన్ల వర్షం కురిపించింది.  డిసెంబర్ 23 న విడుదల నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందిన దంగల్  ఇండియన్ బాక్స్ ఆఫీసులను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అప్రతిహతంగా కొనసాగుతున్న కలెక్షన్లు  ఏకంగా రూ 523.47 కోట్లు  వసూలు కావడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement