
ఆయన ఈవిడతో చేయట్లేదట!
శృంగార తార సన్నీ లియోన్ నెక్స్ట్ సినిమాలో ఆమిర్‌ఖాన్‌తో నటిస్తున్నారట! కొద్ది రోజులుగా ఇది హాట్‌న్యూస్. అయితే, తాజా ఖబర్ ఏమిటంటే, అదంతా వట్టి పుకారు! సాక్షాత్తూ, సూపర్‌స్టార్ ఆమిర్‌ఖానే ఈ సంగతి స్పష్టం చేశారు. ఆమిర్‌ఖాన్ మల్లయోధుడిగా నటిస్తున్న ‘దంగల్’ చిత్రంలో 34 ఏళ్ళ సన్నీ లియోన్ ప్రత్యేక నృత్యగీతం చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ, వచ్చిన వార్తల్లో నిజం లేదని, అవన్నీ వట్టి కబుర్లేననీ 51 ఏళ్ల ఆమిర్‌ఖాన్ స్పష్టం చేశారు.
అయితే, అవకాశం వస్తే సన్నీతో నటించడం ఇష్టమేనన్నారు. ఆ మధ్య కొద్ది నెలల క్రితం ఓ టీవీ జర్నలిస్ట్ సన్నీని ఇంటర్వ్యూ చేస్తూ అనరాని వ్యాఖ్యలు చేశారు. ఆమిర్‌ఖాన్‌తో నటించడం సన్నీకి ఇష్టమైనా, ఆమెతో నటించడానికి ఆమిర్ ఇష్టపడతాడో లేదో అని వ్యాఖ్యానించారు. దానికి సన్నీ లియోన్ బదులిస్తూ, బహుశా ఆమిర్ ఇష్టపడకపోవచ్చన్నారు. ఆ ఇంట ర్వ్యూ బయటకొచ్చాక, ఆమిర్ బాహాటంగా సన్నీకి బాసటగా నిలిచారు.
అవకాశమొస్తే సమీప భవిష్యత్తులో నటిస్తాననీ అన్నారు. అందుకే, ఇప్పుడీ ‘దంగల్’లో స్పెషల్ సాంగ్ పుకారు పుట్టుకొచ్చింది. ఇది ఇలా ఉండగా, ఆమిర్‌తో కాకపోయినా షారుఖ్ ఖాన్‌తో సన్నీ నటిస్తున్నారు. షారుఖ్ హీరోగా వస్తున్న క్రైమ్-థ్రిల్లర్ ‘రాయీస్’లో ఒక పాటలో ఆమె అభినయిస్తున్నారు.