విదేశాల్లోనూ ఆ మూవీకి రికార్డు కలెక్షన్లు! | Indian movie crossed 200 crore collection in overseas | Sakshi
Sakshi News home page

విదేశాల్లోనూ ఆ మూవీకి రికార్డు కలెక్షన్లు!

Published Sat, Jan 28 2017 6:41 PM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM

విదేశాల్లోనూ ఆ మూవీకి రికార్డు కలెక్షన్లు!

విదేశాల్లోనూ ఆ మూవీకి రికార్డు కలెక్షన్లు!

హైదరాబాద్: బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ ఆమీర్ ఖాన్ నటించిన 'దంగల్' బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నితేశ్ తివారీ దర్శకత్వంలో హర్యానా రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్, ఆయన కూతళ్లను ఛాంపియన్లుగా మలచడాన్ని కథాంశంగా తీసుకుని తెరకెక్కించిన దంగల్ మూవీ ఆరో వారం మంచి కలెక్షన్లను వసూలుచేస్తోంది. ఈ నెల 27నాటికి ఓవర్సీస్‌లో 29.69 మిలియన్ డార్లు (భారత కరెన్సీలో రూ.202.21 కోట్లు) రాబట్టిందని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

నిన్న (శుక్రవారం) 28 లక్షలు వసూలు చేసిన దంగల్ మూవీ భారత్‌లో   రూ.384.15 కోట్లతో సరికొత్త రికార్డులు తిరగరాస్తోంది. భారత్‌లో, విదేశాలలో చూస్తే ఓవరాల్‌గా రూ.586.36 కోట్లు వసూళ్లు రాబట్టి మిస్టర్ ఫర్‌ఫెక్ట్ ఆమీర్ మ్యాజిక్‌ను మరోసారి నిరూపించిన మూవీ దంగల్. భారత్‌లో కలెక్షన్లు ఇదే తీరుగా కొనసాగితే దేశంలో రూ.400 కోట్లు వసూలుచేసిన తొలి చిత్రంగానూ మరో రికార్డును చేరుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement