దంగల్‌ నేమ్‌ ప్లేట్‌ | Dangal name plate | Sakshi
Sakshi News home page

దంగల్‌ నేమ్‌ ప్లేట్‌

Published Tue, Jan 24 2017 11:12 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM

దంగల్‌ నేమ్‌ ప్లేట్‌

దంగల్‌ నేమ్‌ ప్లేట్‌

ఎఫెక్ట్‌  

దంగల్‌ సినిమాలోని ఎఫెక్ట్స్‌ది ఏముందీ! దంగల్‌ సినిమా ఎంత ఎఫెక్టివ్‌గా పని చేస్తోందో  బయట చూడాలి. లేటెస్ట్‌ న్యూస్‌ ఏమిటంటే.. దంగల్‌ రిలీజ్‌ అయ్యాక, ఆ సినిమాలోని జైరా వసీమ్‌ స్ఫూర్తితో హర్యానాలోని కమోద్‌ గ్రామంలోని ప్రతి ఇంటి బయటా తలుపులకు ఆ ఇంటి పెద్దమ్మాయి పేరు కనిపిస్తోంది! సాధారణంగా ఇంటి యజమాని పేరు తలుపు మీద ఉంటుంది. ఆ నేమ్‌ ప్లేట్‌ల స్థానంలో అక్కడ పెద్దకూతురు నేమ్‌ప్లేట్‌ తగిలిస్తున్నారు! కమోద్‌లో 450 వరకు ఇళ్లు ఉంటాయి. ఈ గ్రామం ఫొగట్‌ సిస్టర్స్‌ ఉండే ఊరికి 15 కి.మీ. సమీపంలో ఉంటుంది. (ఫొగట్‌ సిస్టర్స్‌ ఇన్‌స్పిరేషన్‌తోనే ‘దంగల్‌’ సినిమా వచ్చింది). ఇప్పుడంటే ఇంటి బయట ఆడకూతురి నేమ్‌ ప్లేట్‌ తగిలించి కమోద్‌ గ్రామం తన ప్రత్యేకతను చాటుకుంది కానీ, ఈ ఊరికి అసలైన ప్రత్యేకత వేరే ఉంది.

దేశమంతా అమ్మాయిల సంఖ్య కన్నా, అబ్బాయిల సంఖ్య ఎక్కువగా ఉంటే.. ఇక్కడ మాత్రం అమ్మాయిల సంఖ్యే ఎక్కువగా ఉంది.1300 అమ్మాయిలు. 1000 మంది అబ్బాయిలు. బాలికల సంరక్షణకు మన దేశం మంచి మంచి పథకాలు చేపడుతోంది. ప్రజలు కూడా ఎవరి పరిధిలో వాళ్లు ఆడపిల్లకు ప్రాధాన్యం ఇస్తే మన సమాజంలో లైంగిక వివక్ష త్వరలోనే తొలగిపోతుంది. చూడాలి... కమోద్‌ను దేశంలోని ఎన్ని గ్రామాలు ఆదర్శంగా తీసుకుంటాయో! ఈ నేమ్‌ ప్లేట్‌ ఐడియా నుంచి మన ప్రధానికి ఇంకేదైనా ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ ఐడియా వస్తుందేమో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement