
ఇద్దరు కూతుళ్లకు తండ్రిగా...
ఎలాంటి పాత్రలో అయినా సునాయాసంగా ఒదిగిపోగల నేర్పు ఉన్న నటుడు ఆమిర్ ఖాన్. అందుకు ఓ ఉదాహరణగా
ఎలాంటి పాత్రలో అయినా సునాయాసంగా ఒదిగిపోగల నేర్పు ఉన్న నటుడు ఆమిర్ ఖాన్. అందుకు ఓ ఉదాహరణగా ఇటీవల విడుదలైన ‘పీకే’ చిత్రాన్ని చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో గ్రహాంతరవాసిగా అలరించిన ఆమిర్ త్వరలో ‘దంగల్’ అనే చిత్రంలో నటించనున్నారు. రెజ్లర్ మహవీర్ ఫోగట్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో ఆమిర్ పంతొమ్మిదేళ్ల కుర్రాడిగా, ఇరవైతొమ్మిదేళ్ల యువకుడిగా, యాభై ఐదేళ్ల వ్యక్తిగా మూడు అవతారాల్లో కనిపించనున్నారు. ఈ మూడింటిలో 55 ఏళ్ల పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందట. మహవీర్‌కి గీత, బబిత కుమారీ అని ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ చిత్రంలో కూడా కూతుళ్ల పాత్రలు ఉంటాయి. సో.. ఆమిర్ ఇద్దరు కూతుళ్లకు తండ్రిగా కూడా కనిపిస్తారన్నమాట. నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది.