స్విమ్‌సూట్‌ ధరించడంతో నటిపై ఆగ్రహం! | Fatima Sana Shaikh trolled for wearing a swimsuit | Sakshi
Sakshi News home page

స్విమ్‌సూట్‌ ధరించడంతో నటిపై ఆగ్రహం!

Published Thu, Jun 8 2017 10:25 AM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM

స్విమ్‌సూట్‌ ధరించడంతో నటిపై ఆగ్రహం!

స్విమ్‌సూట్‌ ధరించడంతో నటిపై ఆగ్రహం!

‘దంగల్‌’  సినిమాలో ఆమిర్‌ఖాన్‌ కూతురు గీతా ఫోగట్‌గా ఆకట్టుకున్న ఫాతిమా సనా షైక్‌ గుర్తుంది కదా. ఆమె అనుకోకుండా వివాదంలో చిక్కుకుంది. స్విమ్‌సూట్‌ ధరించిన కొన్ని అందమైన ఫొటోలను ఈ సుందరి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుచేసింది. మాల్దీవుల్లోని నీలిసముద్రపు తీరాల్లో దిగిన ఫొటోలను షేర్‌ చేసింది. తన తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన వీటిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తుండగానే.. కొందరు మతరక్షకులు రంగంలోకి దిగారు.

పవిత్ర మాసమైన రంజాన్‌లో ఇలా ‘అసభ్యకరమైన’ ఫొటోలు పోస్టుచేస్తావా అంటూ ఆమెపై మండిపడ్డారు. ఆమెను కించపరుస్తూ పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. ఎవరికైనా తమకు నచ్చిన దుస్తులు వేసుకొనే స్వేచ్ఛ ఉంటుంది. దానికి అభ్యంతరం చెప్పడం, కించపరచడం సరికాదని ఆమె అభిమానులు పలువురు ఫాతిమాకు అండగా నిలుస్తున్నారు.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement