Swimsuit
-
గోల్డ్ సాధించిన హీరో తనయుడు
టీ.నగర్: నేషనల్ జూనియర్ స్విమ్మింగ్ పోటీలో నటుడు మాధవన్ కుమారుడు రికార్డు సాధించాడు. మూడు బంగారు, ఒక వెండి పతకాన్నిన్ని సొంతం చేసుకున్నాడు. సోమవారం ఈ వివరాలు వెల్లడయ్యాయి. నటుడు మాధవన్ కుమారుడు వేదాంత్ గత ఏడాది అంతర్జాతీయ స్థాయిలో థాయ్‌లాండ్‌లో జరిగిన ఈత పోటీలో పాల్గొని కాంస్య పతకం అందుకున్నాడు. ఇదిలాఉండగా ప్రస్తుతం జాతీయ స్థాయి ఈత పోటీలో వేదాంత్ మూడు బంగారు, ఒక వెండి పతకాన్ని చేజిక్కించుకున్నాడు. దీంతో అతను పలువురి ప్రశంసలు అందుకుంటున్నాడు. దీనిగురించి నటుడు మాధవన్ తన సోషల్ వెబ్సైట్ పేజీలో దేవుని ఆశీర్వాదంతోను, మీ అందరి ఆశీస్సులతోను తన కుమారుడు జాతీయ స్థాయి రికార్డును సాధించడం సంతోషంగా ఉందన్నారు. -
స్విమ్‌సూట్ ధరించడంతో నటిపై ఆగ్రహం!
‘దంగల్’ సినిమాలో ఆమిర్‌ఖాన్ కూతురు గీతా ఫోగట్‌గా ఆకట్టుకున్న ఫాతిమా సనా షైక్ గుర్తుంది కదా. ఆమె అనుకోకుండా వివాదంలో చిక్కుకుంది. స్విమ్‌సూట్ ధరించిన కొన్ని అందమైన ఫొటోలను ఈ సుందరి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుచేసింది. మాల్దీవుల్లోని నీలిసముద్రపు తీరాల్లో దిగిన ఫొటోలను షేర్ చేసింది. తన తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన వీటిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తుండగానే.. కొందరు మతరక్షకులు రంగంలోకి దిగారు. పవిత్ర మాసమైన రంజాన్‌లో ఇలా ‘అసభ్యకరమైన’ ఫొటోలు పోస్టుచేస్తావా అంటూ ఆమెపై మండిపడ్డారు. ఆమెను కించపరుస్తూ పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. ఎవరికైనా తమకు నచ్చిన దుస్తులు వేసుకొనే స్వేచ్ఛ ఉంటుంది. దానికి అభ్యంతరం చెప్పడం, కించపరచడం సరికాదని ఆమె అభిమానులు పలువురు ఫాతిమాకు అండగా నిలుస్తున్నారు. -
విశ్వ సుందరి గాబ్రియెలా
మాస్కో: మిస్ యూనివ ర్స్ కిరీటాన్ని వెనిజువెలా సుందరి మారియా గాబ్రియెలా ఇస్లర్(25) గెలుచుకున్నారు. శనివారం రాత్రి ఇక్కడ జరిగిన ఫైనల్లో 85 మంది అందగత్తెలను తోసిరాజని ఆమె ఈ ఘనతను సాధించారు. మన దేశానికి చెందిన మానసి మోగే టాప్-10లో ప్రవేశించినా.. టాప్-5లోకి చేరలేకపోయింది. 2000లో భారత్‌కు చెందిన లారాదత్తా మిస్ యూనివర్స్‌గా ఎంపికయ్యారు. ఆ తర్వాత ఆ కిరీటం మనకు అందని ద్రాక్షగా మారింది. టీవీ యాంకర్‌గా పనిచేస్తున్న మారియా.. స్పెయిన్ జానపద నృత్యం ఫ్లమెంకోలో దిట్ట. మిస్ యూనివర్స్‌గా ప్రకటించగానే గాబ్రియెలా ఉద్వేగానికి గురై తన శిరసుపై అలంకరించిన విశ్వసుందరి కిరీటం జారిపోతున్న విషయాన్ని కూడా గ్రహించలేకపోయారు. చివరి నిమిషంలో గమనించిన గాబ్రియెలా కిరీటం కింద పడిపోకుండా పట్టుకున్నారు. 2, 3 స్థానాల్లో మిస్ స్పెయిన్ పాట్రిసియా, మిస్ ఈక్వెడార్ కాన్స్టాంజా నిలిచారు. మిలియన్‌డాలర్ల స్విమ్‌సూట్‌లో గాబ్రియెలా మిస్ యూనివర్స్ కిరీటాన్ని సాధించిన గాబ్రియేలా మాస్కోలో విధులు ప్రారంభించారు. ఆదివారం ఆమె ఓ కార్యక్రమంలో మిలియన్ డాలర్ల (దాదాపు రూ.6 కోట్లు) విలువ చేసే స్విమ్‌సూట్‌లో కనువిందు చేశారు. ఈ స్విమ్సూట్ను 900 విలువైన రత్నాలతో రూపొందించారు. దీనికి రక్షణగా సాయుధ గార్డులు ఉన్నారని మిస్ యూనివర్స్ నిర్వాహక సంస్థ అధ్యక్షుడు పాలా షుగార్ట్ చెప్పారు.