
టీ.నగర్: నేషనల్ జూనియర్ స్విమ్మింగ్ పోటీలో నటుడు మాధవన్ కుమారుడు రికార్డు సాధించాడు. మూడు బంగారు, ఒక వెండి పతకాన్నిన్ని సొంతం చేసుకున్నాడు. సోమవారం ఈ వివరాలు వెల్లడయ్యాయి. నటుడు మాధవన్ కుమారుడు వేదాంత్ గత ఏడాది అంతర్జాతీయ స్థాయిలో థాయ్‌లాండ్‌లో జరిగిన ఈత పోటీలో పాల్గొని కాంస్య పతకం అందుకున్నాడు. ఇదిలాఉండగా ప్రస్తుతం జాతీయ స్థాయి ఈత పోటీలో వేదాంత్ మూడు బంగారు, ఒక వెండి పతకాన్ని చేజిక్కించుకున్నాడు. దీంతో అతను పలువురి ప్రశంసలు అందుకుంటున్నాడు. దీనిగురించి నటుడు మాధవన్ తన సోషల్ వెబ్‌సైట్ పేజీలో దేవుని ఆశీర్వాదంతోను, మీ అందరి ఆశీస్సులతోను తన కుమారుడు జాతీయ స్థాయి రికార్డును సాధించడం సంతోషంగా ఉందన్నారు.