దంగల్ ఖాతాలో మరో రికార్డ్ | aamir Khan Dangal New Record | Sakshi
Sakshi News home page

దంగల్ ఖాతాలో మరో రికార్డ్

Jun 14 2017 11:48 AM | Updated on Sep 5 2017 1:37 PM

దంగల్ ఖాతాలో మరో రికార్డ్

దంగల్ ఖాతాలో మరో రికార్డ్

ఆమిర్ ఖాన్ లీడ్ రోల్లో తెరకెక్కిన దంగల్ సంచలనాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. భారత్లో భారీ వసూళ్లతో సత్తా

ఆమిర్ ఖాన్ లీడ్ రోల్లో తెరకెక్కిన దంగల్ సంచలనాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. భారత్లో భారీ వసూళ్లతో సత్తా చాటిన ఈ సినిమా ఓవర్ సీస్ లోనూ హవా చూపించింది. తరువాత చైనా రిలీజ్తో ఇండియన్ సినిమా కలెక్షన్ల స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. తాజా రికార్డ్ తో ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించి నాన్ ఇంగ్లీష్ సినిమాల లిస్ట్ లో ఐదో స్థానంలో నిలిచింది. ఈ వారాంతానికి 301 మిలియన్ డాలర్ల(1930 కోట్ల రూపాయల)తో సరికొత్త చరిత్ర సృష్టించనుంది దంగల్.

భారత్ లో 84.4 మిలియన్ డాలర్లు వసూళు చేసిన దంగల్, చైనాలో 179.8 మిలియన్ డాలర్లు వసూళు చేసింది. ఇతర ప్రాంతాలతో కలుపుకొని 300 మిలియన్ డాలర్లకు పైగా వసూళు చేసిన దంగల్, అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రం రికార్డ్ సృష్టించడమే కాదు 300 మిలియన్ డాలర్ల వసూళ్లు దాటిన ఐదో నాన్ ఇంగ్లీష్ సినిమా నిలిచింది. దంగల్ కన్నా ముందు చైనా కు చెందిన ది మెర్మైడ్ ($533 మిలియన్స్), మాంస్టర్ హంట్($ 386 మిలియన్స్) ఫ్రాన్స్ సినిమా ది ఇంటచబుల్స్ ($ 427 మిలియన్స్), జపాన్ మూవీ యువర్ నేమ్($ 354 మిలియన్స్) మాత్రమే ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement