
ఆమిర్ 'దంగల్' ట్రైలర్ వచ్చేసింది
ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ దంగల్. ప్రముఖ రెజ్లర్ మహావీర్ పొగట్ జీవిత కథ ఆదారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్...
ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ దంగల్. ప్రముఖ రెజ్లర్ మహావీర్ పొగట్ జీవిత కథ ఆదారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తొలి సారిగా ఆమిర్ ఈ సినిమాలో నలుగురు అమ్మాయిలకు తండ్రిగా 50 ఏళ్ల వయసు వ్యక్తి పాత్రలో కనిపిస్తున్నాడు.
పికె సినిమా తరువాత ఇంత వరకు ఆమిర్ సినిమా రిలీజ్ కాకపోవటంతో అభిమానులు దంగల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే సినిమా రిలీజ్కు మరో రెండు నెలల సమయం ఉన్నా ముందుగానే ట్రైలర్ను రిలీజ్ చేశారు. దాదాపు సినిమా కథ అంతా ట్రైలర్లోనే రివీల్ చేశారు. తన దేశం కోసం బంగారు పతకం సాధించాలనుకున్న మహావీర్ అది సాధ్యం కాకపోవటంతో నిరుత్సాహపడతాడు. తాను చేయలేనిది తన కొడుకు ద్వారా సాధించాలని నిర్ణయించుకున్నాడు.
అయితే తనకు నలుగురు కూతుళ్లే కావటంతో తన కల నెరవేరదని అనుకుంటున్న సమయంలో.., తన కూతుళ్ల శక్తిని గుర్తించి వారినే రెజ్లర్లుగా తయారు చేస్తాడు. రెండు డిఫరెంట్ లుక్స్లో కనిపిస్తున్న ఆమిర్, ఆ లుక్స్ కోసం చాలా కష్టపడ్డాడు. వయసైన పాత్ర కోసం లావుగా తయారయ్యాడు. తరువాత కుర్రాడిగా బరిలో దిగే రెజ్లర్ లుక్ కోసం భారీ కసరత్తులు చేసి కండలు తిరిగిన దేహంతో మరోసారి మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు.