నీ సినిమానే బాగుంది.. అందుకే ద్వేషిస్తున్నా! | Love u personally Aamir but hate u professionally | Sakshi
Sakshi News home page

నీ సినిమానే బాగుంది.. అందుకే ద్వేషిస్తున్నా!

Published Fri, Dec 23 2016 11:00 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM

Love u personally Aamir but hate u professionally

రెజ్లింగ్‌ నేపథ్యంతో సినిమాలు తీసున్నామని, అవి 2016లో విడుదల చేస్తామని ఆమిర్‌ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ ప్రకటించినప్పుడు ఒకింత ఆసక్తితోపాటు ఆశ్చర్యపరిచింది. సల్మాన్‌ ’సుల్తాన్‌’, ఆమిర్‌ ’దంగల్‌’  చిత్రాల్లో ఎవరి సినిమా విజేతగా నిలుస్తుందన్న చర్చ జరిగింది.

సల్మాన్‌ ’సుల్తాన్‌’ మొదట విడుదలైంది. భారీ కలెక్షన్లతో ఊహించినట్టుగానే ఈ సినిమా సూపర్‌హిట్‌ అయింది. ఒలింపిక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ సుల్తాన్‌ అలీఖాన్‌ అనే వ్యక్తి ఉత్థానపతనాలు ఇతివృతంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ కథ పూర్తిగా కల్పితం. కానీ ఇప్పుడు ఆమిర్‌ ఖాన్‌ నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ’దంగల్‌’  సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్ఫూర్తిదాయకంగా మలిచిన ఈ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రివ్యూలు రావడం ఆసక్తి రేపుతోంది.

మరోవైపు ఈ ఏడాది వచ్చిన సుల్తాన్, దంగల్‌ సినిమాల్లో ఏది అత్యుత్తమ సినిమా అన్న చర్చ అభిమానుల్లో నడుస్తోంది. ఈ చర్చపై ఏకంగా బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ స్పందించాడు. తన సుల్తాన్‌ సినిమా కన్నా దంగల్‌ ఎంతో బాగుందని కితాబిచ్చాడు. ఆమిర్‌ వ్యక్తిగతం ప్రేమించినా.. వృత్తిపరంగా ఆయనను ద్వేషిస్తానంటూ ట్విస్టు ఇచ్చాడు. ’మా కుటుంబం ఈ రోజు దంగల్‌ సినిమా చూసింది. ఇది సుల్తాన్‌ కన్నా ఎంతో బాగుంది. ఆమిర్‌, నిన్ను వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నా.. కానీ వృత్తిపరంగా ద్వేషిస్తున్నా’ అంటూ సల్మాన్‌ చేసిన ట్వీట్‌ నెటిజన్లను అలరిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement