
నాలుగు నెలలు...పదిహేను కేజీలు!
‘బంచిక్ బంచిక్ చేయి బాగా.. ఒంటికి యోగా మంచిదేగా....’ అంటూ సన్నబడాలనుకునేవాళ్లు యోగా చేసి చిక్కుతారు.
‘బంచిక్ బంచిక్ చేయి బాగా.. ఒంటికి యోగా మంచిదేగా....’ అంటూ సన్నబడాలనుకునేవాళ్లు యోగా చేసి చిక్కుతారు. లావవ్వాలంటే.. కండలు పెరగాలంటే మాత్రం జిమ్ చేయాలి. కడుపు నిండా తినాలి. ఆ మధ్య ఆమిర్‌ఖాన్ అదే చేశారు. మల్లయోధునిగా ఆమిర్ నటిస్తున్న చిత్రం ‘దంగల్’. ఈ సినిమా కోసం 15 కేజీల బరువు పెరిగారు ఆమిర్. సినిమా మొత్తం ఈ వెయిట్‌తో కనిపించరు. చిక్కిన ఆమిర్ కూడా కనిపిస్తారు. అందుకే ముందు పెరిగి, ఆ సీన్స్ తీశాక తగ్గారు. ఇంతకీ ఈ హీరోగారు ఎలా బరువు తగ్గారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
జస్ట్ రన్నింగ్‌తోనే 15 కేజీలు తగ్గారట. నాలుగు నెలల్లో రోజుకు 7 నుంచి 9 కిలోమీటర్ల చొప్పున పరిగెత్తారట. అంటే.. మొత్తం వెయ్యి కిలోమీటర్ల పైనే. రన్నింగ్‌తో పాటు స్ట్రిక్ట్ డైట్ కూడా ఫాలో అయ్యారు. దాంతో నాలుగు నెలల క్రితం ఆమిర్‌ని చూసినవాళ్లు ఇప్పుడు చూసి, ‘ఔరా’ అనకుండా ఉండలేకపోతున్నారు.