ప్రభాస్ పెళ్లిపై స్పందించిన స్టార్ హీరోయిన్ | Actress Shraddha Kapoor reacts on Prabhas marriage | Sakshi
Sakshi News home page

ప్రభాస్ పెళ్లిపై స్పందించిన స్టార్ హీరోయిన్

Published Tue, Jan 23 2018 7:30 PM | Last Updated on Tue, Jan 23 2018 10:47 PM

Actress Shraddha Kapoor reacts on Prabhas marriage - Sakshi

సాక్షి, ముంబయి: టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ అనగానే టక్కున వచ్చే సమాధానం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు. గతంలో బాహుబలి ప్రాజెక్ట్ అలా ముగియగానే ఇలా ప్రభాస్‌ పెళ్లి చేయడమే అంటూ వదంతులు ప్రచారం అయ్యాయి. ఆపై ఈ కొత్త ఏడాదిలో ప్రభాస్ వివాహం చేసుకోబోతున్నారని, కుటుంబసభ్యులు ఈ విషయంపై దృష్టిపెట్టారని టాక్ వినిపించింది. నిన్న మొన్నటి వరకూ ప్రభాస్ పెళ్లి గురించి పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు నోరు విప్పారు. తొలుత బాహుబలి తర్వాత అన్నాడు.. ఆపై లేటెస్ట్ మూవీ సాహో తర్వాతే అని ప్రభాస్ సిగ్నల్ ఇస్తున్నట్లు చెప్పకనే చెప్పేశారు.

ఇదే విషయంపై సాహో మూవీలో ప్రభాస్‌తో జతకట్టిన బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్‌ను మీడియా సంప్రదించింది. హీరోతో సాహోలో నటిస్తారు కదా.. ప్రభాస్ పెళ్లి గురించి మీకు ఏమైనా తెలుసా.. ఆయన ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారా అని ప్రశ్నించారట. చాలా కష్టమైన ప్రశ్న అన్న శ్రద్ధా కపూర్.. యంగ్ రెబల్ స్టార్ గురించి మాట్లాడుతూ.. ‘ప్రభాస్ పెళ్లి గురించి నాకు అంతగా తెలియదు. వివాహమన్నది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. ఈ ప్రశ్నను ఆయనను అడగటమే ఉత్తమం. ఆయన ఉత్తమ నటుడు, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి’ అన్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న సాహోను దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్నారు. మరోవైపు రాజ్‌కుమార్‌ రావ్, శ్రద్ధాకపూర్‌ జంటగా నటిస్తున్న హర్రర్‌ కామెడీ మూవీ ‘స్త్రీ’ ఇటీవల షూటింగ్ ప్రారంభమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement