
Interval Scenes From Salaar Movie May Be Reshoot: దర్శకధీరుడు రాజమౌళి తీసిన 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన డార్లింగ్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాకా ప్రభాస్ నుంచి రాబోతున్న మరో భారీ యాక్షన్ చిత్రం 'సలార్'. కేజీఎఫ్‌తో అద్భుతమైన హిట్ సొంత చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వస్తున్న 'సలార్' చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇండియన్ స్క్రీన్‌పైనే మోస్ట్ అవైటెడ్ మూవీగా 'సలార్' మారింది. అయితే ఈ అంచనాలను అందుకోవాలని తపనతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి సంబంధించి ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కావడం లేదు.
అయితే సలార్ ఇంటర్వెల్ సీక్వెన్స్‌ను మళ్లీ రీషూట్ చేస్తున్నారట. నిజానికి ఈ సీన్ షూట్ ఇదివరకే పూర్తయిన.. ఔట్‌పుట్ విషయంలో ప్రశాంత్ అసంతృప్తిగా ఉన్నాడట. అందుకే ఈ సీన్‌ను రీషూట్ చేయాలని భావిస్తున్నారట. ఇంటర్వెల్ సీన్ సినిమాకే హైలెట్‌గా ఉంటుందన్న నమ్మకంతో ప్రశాంత్ పట్టుదలగా ఉన్నాడని సమాచారం. ఇక 'సలార్' స్పెషల్ సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించనుందని తెలుస‍్తోంది. స్పెషల్ సాంగ్ కోసం శ్రద్ధాను ఎంపిక చేశారట మేకర్స్. సాహో సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధా అలరించిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: ప్రభాస్ మంచి మనసు.. ఏపీ వరద బాధితులకు భారీ విరాళం